మనలో చాలా మందికి కారవాన్ అంటే ఏంటో కూడా తెలియకపోయి ఉండొచ్చు..? అయితే కారవాన్ అంటే అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని గొప్ప గొప్ప నటులు, ప్రముఖ రాజకీయ వేత్తలు ఈ కారవాన్ లను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కారవాన్ అంటే ప్రముఖులు వారి స్థాయికి తగ్గట్టుగా దానిని డిజైన్ చేయించుకుంటూ  ఉంటారు. ఇది చూడడానికి అచ్చం బస్సు లాగా ఉంటుంది. కానీ ఇందులో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే విశ్రాంతి తీసుకోవడానికి, స్నానం చేయడానికి, భోజనం చేయడానికి, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో గడపడానికి, ఇలా అచ్చం ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలగజేస్తుంది ఈ కారవాన్ ..


అయితే ప్రస్తుతం ఈ కారవాన్ ల ట్రెండ్ నడుస్తోంది. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా కొందరు సినీ ప్రముఖులు ఈ కారవాన్ లను ఉపయోగిస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ, ప్రభాస్, మహేష్ బాబు లు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే కాజల్,  నయనతార లకు కూడా సొంతంగా కారవాన్ లు ఉన్నాయి.


ఇటీవల మహేష్ బాబు కూడా తన సొంత కారవాన్ ను కొనుగోలు చేశారు . అయితే షూటింగ్ సెట్లో ఖాళీగా ఉన్న సమయంలో, మహేష్ బాబు విశ్రాంతి తీసుకోవడానికి ఈ కారవాన్ ను ఉపయోగిస్తారట. అలాగే హోటల్ రెడీగా లేనప్పుడు,  షాట్ కు రెడీ అవడానికి ,వర్షం పడినప్పుడు, కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడపడానికి మహేష్ బాబు ఈ కారవాన్  ను ఉపయోగిస్తున్నారని సమాచారం.. అయితే ముంబైకి చెందిన ఒక డిజైనర్ ఈ కారవాన్ ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు సమాచారం.


అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి కూడా సొంత కారవాన్ ఉంది. అలాగే రామ్ చరణ్ కి కూడా సొంత కారవాన్ ఉంది. అయితే అఖిల్ తన మొదటి సినిమా షూటింగ్ కోసం కొద్ది రోజులు ఉచితంగా వాడుకోమని రామ్ చరణ్ కారవాన్ ను ఇచ్చాడు. అలాగే రవితేజ కూడా సొంత కారవాన్ ఉంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కూడా  సొంత కారవాన్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: