రామ్ గోపాల్ వర్మ కి ఇండస్ట్రీకి కొత్త నటులను పరిచయం చేయడం బాగా  అలవాటు. ఇప్పటికే ఆయన పరిచయం చేసిన చాలామంది నటులు బాలీవుడ్లో మరియు టాలీవుడ్లో రాణిస్తున్నారు. అయితే ఆయన ఈ మధ్యనే ఒక షార్ట్ ఫిల్మ్  ద్వారా ఒక హీరోయిన్ ని  ఇంట్రడ్యూస్ చేశారు ఆమె అప్సర రాణి. షార్ట్ ఫిలిం ఎన్ ఎన్ ఎన్ ద్వారా పరిచయమైన అప్సర ఆ షార్ట్ ఫిల్మ్ లో తన అందాన్ని ప్రదర్శించే అందరి కళ్ళల్లో పడింది. ఆ తర్వాత అప్సర అర్జీవి దర్శకత్వంలోనే ఓ సినిమా కూడా   చేస్తుంది. ఇక ఈ మధ్యనే వచ్చిన క్రాక్ సినిమాలో  అప్సర ఐటమ్ పాట భూమ్ బద్దలు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్ కి థియేటర్స్ లో ఆడియెన్స్ డ్యాన్సులు వేశారు . అంతలా అప్సర అందరిని అలరించింది .ఈ పాట తర్వాత అప్సర రాణి త్వరలో విడుదల కాబోతున్న రామ్ గోపాల్ వర్మ డి కంపెనీ లో కూడా ఒక ఐటమ్ సాంగ్ చేసింది. ఆ ఐటమ్ సాంగ్ ఈరోజు విడుదల కాబోతుంది. ఈ సాంగ్ లో అప్సర చాలా హాట్ గా ఉండబోతుంది అని పోస్టర్స్ చూస్తేనే అర్థం అవుతుంది. ఇక అర్జీవి ఆమెని ఎలా చూపిస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. అయితే ఆ పాటతో ఆమె ఇంకొక  ఛాన్స్ కూడా కొట్టేసింది. అది గోపీచంద్ నటిస్తున్న సిటీమార్ సినిమాలో కూడా అప్సర ఒక ఐటం సాంగ్ చేయబోతుంది . ఈ సాంగ్ షూటింగ్ ఈ మధ్య మొదలు పెట్టారు. ఇలా వరసగా అప్సర రాణి ఐటమ్ సాంగ్స్ చేసుకుంటూ దూసుకెళ్తుంది. ఇక ఈమె లిస్ట్ లో ఎన్ని ఐటమ్ సాంగ్స్ ఉన్నాయో ఇంకా ఎవరికి తెలీదు.

మరింత సమాచారం తెలుసుకోండి: