తమ సినిమా షూటింగ్ వాయిదా పడుతుందని టెన్షన్ పడ్డారు.కానీ తాజాగా ఆమె కోవిడ్ 19 టెస్ట్ చేయించుకోగా, అది నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది.దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలియా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని అలియానే స్వయంగా వెల్లడించారు. `డాక్టర్ల సలహా మేరకు కరోనా పరీక్ష చేయించుకోగా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం నుంచే షూటింగ్ పాల్గొంటున్నాను. మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. కోవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా ఉన్నాను.
మీరు కూడా అలాగే ఉండండి` అని తెలిపింది.ప్రస్తుతం ఆమె హిందీలో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న `గంగూబాయ్ కథియవాడి` చిత్రంలో నటిస్తుంది. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ఆర్‌ఆర్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ వారంలోనే ఆమె `ఆర్‌ఆర్‌ఆర్`లో జాయిన్ కావాల్సి ఉంది. కరోనా నెగటివ్ రావడంతో ఈ చిత్రీకరణలో పాల్గొంటారని టాక్. దీంతో ఇప్పుడంతా రిలాక్స్ అయిపోయారు. రామ్‌చరణ్, అలియాపై ఓ రొమాంటిక్ సాంగ్‌ని షూట్ చేయబోతున్నారు రాజమౌళి..ఇక దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది rrr సినిమా.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి