కొద్ది రోజుల క్రితం కొరియన్ భాషకు చెందిన లక్కీ కీ అనే సినిమాను రీమేక్ చేస్తున్నట్లు సురేష్ ప్రొడక్షన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్, హీరో ఎవరు అనే విషయాలు ఏవీ ప్రకటించ లేదు. ఒక పేరున్న డైరెక్టర్ దీనిని తెలుగులోకి అనువదించే పనిలో ఉన్నారు అని మాత్రం ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ ఐన దాని ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు అని అంటున్నారు. అయితే ఇదే సినిమాలో దగ్గుబాటి రానా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు అని అంటున్నారు.


నిజానికి కొరియాలో 2016 లో విడుదలైన లక్కీకీ అనే సినిమా సూపర్ హిట్ అయింది. దీనిని తెలుగు ప్రేక్షకులకు అందించాలని భావించిన సురేష్ ప్రొడక్షన్ సంస్థ దాని రీమేక్ రైట్స్ కొనుక్కుంది. నిజానికి ఇదే సురేష్ ప్రొడక్షన్ సంస్థ గతంలో మిస్ గ్రానీ అనే సినిమాని కొనుగోలు చేసి దాన్ని ఓ బేబీ పేరిట తెలుగులో రీమేక్ చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమాని కూడా నిర్మించడానికి సిద్ధమైంది.


కామెడీ అండ్ క్రైం ఎంటర్టైనర్ గా రిలీజయ్యి సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి సంబంధించిన అన్ని ఇండియన్ లాంగ్వేజ్ రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కొనుగోలు చేసింది. అయితే వెంకటేష్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అని ప్రచారం మొదలు కావడానికి ఓ కారణం కూడా ఉంది. ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఎప్పుడైతే ఈ సినిమా చేస్తున్నామని ప్రకటించిందో ఆ వెంటనే వెంకటేష్ తన సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో ఈయన ఈ సినిమాలో నటిస్తారని ప్రచారం మొదలు యుండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: