వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'.. దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మించిన  ఈ మూవీ శుక్రవారం ఏప్రిల్9 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘పింక్‌’కు రీమేక్‌గా వచ్చిన ‘వకీల్ సాబ్’కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్‌.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.20 కోట్లు కలెక్ట్ చేసింది.

 ప్రపంచవ్యాప్తంగా రూ.38 నుంచి రూ.40 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.అమెరికాలో ఈ చిత్రాన్ని వీకెండ్ సినిమా, సదరన్ స్టార్ ఇంటర్నేషనల్ సుమారు 260కి పైగా లోకషన్లలో విడుదల చేశాయి.అక్కడ ఒకరోజు ముందుగానే(ఏప్రిల్ 8న) పడ్డ ప్రీమియర్ల ద్వారా ఏకంగా 3 లక్షల డాలర్ల కలెక్షన్స్ వచ్చినట్లు వీకెండ్ సినిమా వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు వకీల్ సాబ్‌కు 4 లక్షల డాలర్లు వసూళ్లయ్యాయని వీకెండ్ సినిమా ట్వీట్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటల(యూఎస్ కాలమానం ప్రకారం) వరకు ఈ వసూళ్లు వచ్చినట్లు తెలియజేసింది.

లాక్‌డౌన్ తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన తొలి భారతీయ చిత్రం కూడా వకీల్ సాబే.ఇక వకీల్ సాబ్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది కాబట్టి వారాంతంలో సినిమా వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా, పవన్ కల్యాణ్ చివరగా నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం అమెరికాలో 2.06 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టింది. అలాగే అయితే ఇటీవలే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అందుకున్న జాతిరత్నాలు సినిమా కూడా అక్కడ బాగానే వసూల్ చేసింది. జాతిరత్నాలు ప్రీమియర్ షోలతో 132కే డాలర్స్ వసూల్ చేసినట్లు తెలుస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: