టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోని టాలీవుడ్ టాప్ స్టార్ హీరోస్ లో ఒకడిగా ఎదిగాడు.ఆయన టాలీవుడ్ సినీ పరిశ్రమకి ఆరడుగుల బుల్లెట్ లాంటివాడు. ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్నాడు.ఒక పక్క ప్రజలకు సేవ చెయ్యడానికి రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ఆ సినిమాలు కూడా తన పార్టీ ఖర్చుల కోసం తీస్తున్నాడు ఆయన.ఇక పవర్ స్టార్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో దాదాపు మూడు సంవత్సరాల తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించాడు.


వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.కరోనా వలన పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయిన పవర్ స్టార్ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.ఇక సినిమా విడుదల అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది..ఇక అసలు విషయానికి వస్తే..కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందనే భయం కూడా లేకుండా ఆయన సినిమా కోసం ఎగబడి చూస్తున్నారు అభిమానులు. దీన్ని బట్టి పవర్ స్టార్ క్రేజ్ ఏంటో అని పూర్తిగా అర్ధమయిపోతుంది. ఇక పవర్ స్టార్ క్రేజ్ ని అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకునే నటుడు టాలీవుడ్ లో లేడా అనే ప్రశ్నకు ఒక స్టార్ వున్నాడని సమాధానం గట్టిగా వినిపిస్తుంది. ఆ స్టార్ మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ మహేష్ బాబు.

కేవలం మహేష్ మాత్రమే తెలుగులో పవన్ కళ్యాణ్ కి గట్టి పోటీ ఇచ్చే హీరో. పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో అంతే క్రేజ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా వుంది. వీళ్లిద్దరికీ కూడా సమాన క్రేజ్, ఫ్యాన్స్ ఉండడం వలన రికార్డులు ఈజీగా సృష్టించగలరు. ఇక పవన్ కళ్యాణ్ కి గట్టి పోటీ అంటే అది మహేష్ బాబు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: