టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయనకీ సామాజిక బాధ్యత చాలా ఎక్కువ.మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోని టాలీవుడ్ టాప్ స్టార్ హీరోస్ లో ఒకడిగా ఎదిగాడు.ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్నాడు.ఒక పక్క ప్రజలకు తనవంతు ఎంతో కొంత సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ఆ సినిమాలు కూడా తన పార్టీ ఖర్చుల కోసం తీస్తున్నాడు తప్ప తన స్వలాభం కోసం కాదు.ఇక పవర్ స్టార్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో దాదాపు మూడు సంవత్సరాల తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించాడు.వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.


కరోనా వలన పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయిన పవర్ స్టార్ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.ఇక సినిమా విడుదల అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది..ఇక అసలు విషయానికి వస్తే..పవన్ కళ్యాణ్ ని దేవుడు అంటారు ఆయన ఫ్యాన్స్. ప్రజల పట్ల ఆయనకు అపారమైన బాధ్యత ఉందని చెప్పుకుంటారు. ప్రజలు కోసం తాను దేనికైనా సిద్ధం అని పెద్ద పెద్ద స్పీచ్ లు కూడా ఇస్తుంటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే సమాజంలో కొందరు జనాలు ఇంకా సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ ఆయన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి నిజంగా ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఆయన ఇలాంటి పరిస్థితిలో తన సినిమాని విడుదల చెయ్యడానికి ఒప్పుకోడు. ఎందుకంటే కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.


ఆయన సినిమా విడుదల అవ్వడంతో చాలా మంది జనాలు ఏమాత్రం బాధ్యత లేకుండా సినిమా చూడటానికి గుంపులు గుంపులుగా వస్తున్నారు. దీని వల్ల కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతాయి అని ఆయనకు కూడా తెలుసు.. ఇవన్నీ తెలిసి కూడా ఆయన తన సినిమాని వాయిదా వెయ్యకుండా ఎందుకు విడుదలకి ఒప్పుకున్నట్టు..? ఇదేనా ఆయనకు సమాజం పట్ల వున్న బాధ్యత అని జనాలు విమర్శిస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: