పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఘోరమైన అపజయాలను ఎదుర్కొన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ పై అణువంతైనా ప్రభావం పడలేదు. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ అతని పై టాలీవుడ్ ప్రేక్షకులకు అభిమానం పెరిగిపోతుందే తప్ప కొంచెం కూడా తగ్గిన ఆనవాళ్ళు అస్సలు కనిపించడం లేదు. నటుడు నిర్మాత బండ్ల గణేష్ చెప్పిన విధంగా పవన్ కల్యాణ్ ప్రేక్షకులకు ఒక వ్యసనంలా మారిపోయారు. ఈ స్టేట్ మెంట్ కి నిదర్శనంగా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూలు అవుతున్న కలెక్షన్లు నిలుస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ బాక్సాఫీసు కలెక్షన్ల పై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు ప్రభావం చూపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలోనే ఆ రాత్రికి రాత్రే ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ఆర్డర్స్ విడుదలయ్యాయి.



ప్రత్యేకంగా సినిమా టికెట్ చార్జీలను పెంచకూడదు అని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. టికెట్ల ధరలను పెంచితే థియేటర్ల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో వకీల్ సాబ్ మూవీ డిస్ట్రిబ్యూటర్లతో పాటు థియేటర్ల యజమానులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్ల వాదనలు విన్న హైకోర్టు సానుకూలంగా స్పందించింది. వకీల్ సాబ్ మూవీకి సంబంధించి మొదటి మూడు రోజులు టికెట్ల ధరలు పెంచుకోవచ్చని హైకోర్టు తీర్పు వెలువరిస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్ల తో సహా ప్రభుత్వానికి హైకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది.




దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మొదటి రోజే 32 కోట్లు వసూలు చేసిన వకీల్ సాబ్ చిత్రం రెండవ రోజు కూడా భారీ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల్లో డబ్బులు వసూలు చేస్తోంది. టికెట్ ధరలు పెరగడం వలన సినిమాకి మరింత కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలా చూసుకుంటే రూ.100 కలెక్షన్ ఈజీయే కదా! అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: