పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకులందరినీ మెప్పిస్తూ మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది.  ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ తొమ్మిదో తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. అయితే దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు అందరినీ సంతృప్తి పరిచే విధంగా వకీల్ సాబ్ సినిమా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  పవన్ కళ్యాణ్  ను వెండి తెరపై చూడాలని ఎంతో ఆశగా ఉన్న అభిమానులందరికీ ఆశ ఈ సినిమాతో తీరింది అని చెప్పాలి.



 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సబ్ సినిమాలో ఒక లాయర్ పాత్రలో నటించారు. అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది అధికార వైసీపీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వకీల్ సబ్ కు మరో షాక్ తగిలింది .  మూడు రోజుల పాటు వకీల్ సాబ్ టిక్కెట్ ధరలను పెంచుకోవచ్చు అంటూ ఇటీవల ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయించుకుంది.  అయితే  వైరస్ తర్వాత తొలి మూడు వారాలు సినిమాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది.



 వకీల్ సాబ్ సినిమా విషయంలో మాత్రం తాము ఇచ్చిన పర్మిషన్ మర్చిపోయింది ఏపీ ప్రభుత్వం.  ముఖ్యంగా వకీల్ సాబ్ బెనిఫిట్ షో ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే వ్యవహరిస్తుందేమో అని అనుకున్నప్పటికీ అలా జరగలేదు తొలి రెండు వారాల పాటు టికెట్ ధర పెంచుకోవచ్చు అంటూ ఏపీ హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచలేదు. వకీల్ సాబ్ కి టికెట్ ధర పెంచకుండా అటు జెసి ఉత్తర్వులు జారీ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. దీంతో ప్రస్తుతం మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతున్న వకీల్ సాబ్ సినిమాకు ఒక రకంగా భారీ షాక్ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: