తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో చాలా వరకు డైరెక్ట్ సినిమాలు ఉండగా కొన్ని రీమేక్లు అలానే మరి కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి తెలుగు ప్రేక్షకులు మంచి కథా కథనాలు ఉంటే అది ఎటువంటి సినిమా అయినా సరే ఆదరించడంలో ముందు ఉంటారు అని చెప్పక తప్పదు. ఇక ప్రస్తుతం ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ల కలయికలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని బోనికపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందించారు. కోర్ట్ డ్రామా మూవీ గా తెరకెక్కి ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయిన పింక్ మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ స్టోరీ కొంత కమర్షియల్ హంగులు కలగాలిపి దానితో సక్సెస్ కొట్టారు దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే గతంలో వచ్చిన పలు రీమేక్ సినిమాలను మనం పరిశీలిస్తే చాలావరకు అవి అచ్చం ఉన్నది ఉన్నట్లుగానే పెద్దగా మార్పులు చేయకుండా రీమేక్ చేయడం గమనించవచ్చు.

అయితే వకీల్ సాబ్ కూడా ఆ విధంగానే రీమేక్ చేయబడినప్పటికీ ఇందులో మెయిన్ ప్లాట్ ఎక్కడా దెబ్బతినకుండా పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా దర్శకుడు వేణు శ్రీరామ్ పొందుపరిచిన కమర్షియల్ అంశాలకు అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమా ప్రస్తుతం అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయి కలెక్షన్లు అందుకుంటూ దూసుకెళుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: