పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ రి ఎంట్రీ సినిమా కావడంతో ప్రస్తుతం అభిమానులందరూ థియేటర్లకు భారులు దీరుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ను మరోసారి వెండితెరపై చూసి మురిసిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమా థియేటర్లు ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అంతేకాదు మూడేళ్ల నుంచి నిరీక్షణ గా ఉన్నా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో మరోసారి పవర్ స్టార్ వెండితెరపై కనిపించడంతో మురిసిపోతున్నారు.



 అయితే ప్రస్తుతం మంచి టాక్ ను సొంతం చేసుకున్న వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది ఇప్పటికే భారీ వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టే  విధంగానే కనిపిస్తుంది.  ఇకపోతే చిత్ర బంధం మొత్తం సినిమా కోసం ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో కి గెస్ట్ లూగా ఎంట్రీ ఇచ్చారు వకీల్ సాబ్ చిత్రాబృందం . ఈ క్రమంలోనే వకీల్ సాబ్ సినిమాలోని కోర్టు సన్నివేశాలను కాపీ చేస్తూ క్యాష్ సెట్ పై బోన్ లను ఏర్పాటు చేశారు.



 ఈ క్రమంలోనే ఒకవైపు డైరెక్టర్ ను యాంకర్ సుమ ప్రశ్నలు అడుగుతోంది .  ఇక సుమ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను మీరు ఫస్ట్ ఎక్కడ కలిశారు అని సుమ అడుగగా తాను మొదటి సారి పవన్ కళ్యాణ్ ని ఒక క్లబ్ లీక్ కలిలిసానని .. 15 ఏళ్ల క్రితం ఈ విషయం జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు ఇక షూటింగ్ జరుగుతున్న సమయంలో మీరు పవన్ కళ్యాణ్ పై చేయి వేశారట అవునా అంటూ సుమ ప్రశ్నించగా ఏంటి మేడం మొత్తం కాంట్రవర్సి ప్రశ్నలు అడుగుతున్నారు.. నన్ను ఇలాంటి ప్రశ్నలు అడగవద్దు అంటూ డైరెక్టర్ చెప్పడంతో అందరూ నవ్వుకుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: