టాలీవుడ్ లో మహాశివరాత్రి సందర్భంగా ఒకే రోజు మూడు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో జాతిరత్నాలు సినిమా ఒకటీ. అయితే విడుదల అయినా  మిగతా రెండు సినిమాలతో పోలిస్తే జాతిరత్నాలు కి మంచి టాక్ వచ్చింది. సినిమా బాగుంది అన్నారు కానీ ఈ స్థాయి రేంజ్ హీట్ ని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు జాతి రత్నాలు సినిమా టాక్ మరింత పెరిగిపోయింది. మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. అయితే ఆదివారానికి బ్రేక్ ఈవెన్ లో పడింది.

జాతిరత్నాలు సినిమా జోరు మరో వారం రోజుల వరకూ ఉండే అవకాశం ఉందని లెక్కలు వేసిన వారి అంచనాలు తప్పాయి. అందరి అంచనాలు అధిగమించి ఏకంగా రూ.11 కోట్ల క్రియేటివ్ బిజినెస్ తో మూడు వారాల్లోనే రూ
35 కోట్లకు పైగా షేర్ సాధించింది. అయితే ఆ సక్సెస్ స్టోరీ ఓటీటీ కి వచ్చేసరికి తిరగబడింది. జాతి రత్నాలు సినిమా సరిగ్గా నెల రోజుల గ్యాప్ తో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది.


థియేటర్ కు వెళ్లి చూసినవారంతా తెగ నవ్వుకున్నారు. కానీ ఓటీటీ చిత్రానికి వచ్చేసరికి నచ్చడం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ స్థాయి హిట్ మూవీ కి ఓటీటీ లో బ్రహ్మరథం పడతారు అనుకుంటే, సీన్ రివర్స్ గేర్ లా డీలా పడిపోయింది ఈ సినిమా. థియేటర్లో చూడని ప్రేక్షకులు ఆన్లైన్లో చూద్దామని ఎదురుచూశారు.. చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా చూశాక ఇందులో ఏముందని.. ఇంతలా ఆడిందని ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఇందులో కామెడీ ఏముందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో సినిమా జనాలకు ఓ విషయం అర్థమైంది. థియేటర్ కు ఓటీ టీ కి ఆడియన్స్ టెస్ట్ లలో చాలా తేడాలు ఉన్నాయని, జనం మధ్యలో చూసే సినిమాకు,  ఇంట్లో ఒంటరిగా కూర్చొని చూసే సినిమాకు ఎక్స్పీరియన్స్ లో చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ నేపథ్యంలో పోటీలో జాతి రత్నాలు సినిమా అంతగా  ఏమీ లేదని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: