పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. తన కెరీర్ లోచాలా మంచి రోల్స్ చేసిన పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించడం ఇదే తొలిసారి. దాంతో ఈ లాయర్ జాబ్ కిఇప్పుడు చాలా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు బయట ఓకొత్త రకం వాదన వినిపిస్తుంది.అదేంటంటే చాలామందికి లాయర్ వృత్తిపై గౌరవం పెరిగి లా కోర్సులు చేయడానికి రెడీ అవుతున్నారట..అలా వకీల్ సాబ్ సినిమా చాలామందికి కనువిప్పు తెచ్చింది అంటున్నారు. అయితే గతంలో లేని పాపులారిటీ ఇప్పుడు ఎలా వచ్చింది.. గతంలో మన టాలీవుడ్ హీరోలు ఎవరెవరు ఈ లాయర్ సాబ్ పాత్రలు పోషించారు అనేది చూద్దాం..

చెట్టుకింద ప్లీడర్ సినిమా లో రాజేంద్ర ప్రసాద్ లాయర్ గా నటించి నవ్వులపువ్వులు పూయించారు. ఈమధ్యే యంగ్ హీరో సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ సినిమాలో లాయర్ గా పవర్ ఫుల్ పాత్ర పోషించాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో కూడా ఎన్టీఆర్ లాయర్ పాత్ర లో అద్భుతంగా నటించాడు. నాగార్జున మోహన్ బాబు అధిపతి సినిమాలో లాయర్ గా నటించాడు.. మోహన్ బాబు ను ఓ పెద్ద కేసును నుంచి తప్పించే లాయర్ పాత్ర ను నాగార్జున పోషించి ఆ సినిమా కి గెస్ట్ గా వచ్చాడు.

హీరో శ్రీకాంత్ రాధాగోపాళం సినిమాలో లాయర్ పాత్రలో నటించాడు. సూపర్ స్టార్ కృష్ణ గూండారాజ్యం లో , చిరంజీవి అభిలాష లో, వెంకటేష్ ధర్మ చక్రంలో, ఎన్టీఆర్ లాయర్ విశ్వనాధం,  అక్కినేని నాగేశ్వర రావు సుడిగుండాలు, లో లాయర్ పాత్రలు పోషించి ఆ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే లాయర్ వృత్తి పట్ల ఇష్టాన్ని కూడాపెంపొందించారు.ఇంకా సత్యదేవ్ తిమ్మరుసు, గోపీచంద్ పక్క కమర్షియల్ చిత్రాలతో లాయర్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈనేపథ్యంలో ఆ సినిమాలు ఏ లెవెల్లో హిట్ అవుతాయో చూద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి: