కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఇండియన్‌-2’ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం బాధ్యత తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ చాలా రోజులు వాయిదా పడడం.. ప్రస్తుతం కమల్‌ రాజకీయాల్లో బిజీగా ఉండడం.. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నుంచి డీవోపీ రత్నవేలు కూడా తప్పుకోవడం.. ఇలా కారణాలు ఏమైనా ఈ సినిమాలో మధ్యలోనే ఆగిపోయింది.అయితే ఈ మధ్య ఈ సినిమా నిర్మాతలు శంకర్ మీద కేస్ వెయ్యడం మళ్ళీ శంకర్ భారతీయుడు 2 సినిమా చేస్తానని ఒప్పుకోవడం లాంటివి జరిగాయి.

 ఇక ఈ మధ్య ప్రముఖ నిర్మాత దిల్ రాజు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమాను ప్రకటించారు .ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం అయ్యింది.  ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతుంది.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమా విషయానికి వస్తే.. రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ ఈ సినిమాని పట్టాలు ఎక్కిస్తారు. అయితే శంకర్ ఈ రెండు చిత్రాలే కాకుండా ఈ మద్యనే హిందీలో రణవీర్ సింగ్ తో కొత్త సినిమాని ఒప్పుకున్నాడు. తమిళంలో వచ్చి సూపర్ హిట్ అయిన అపరిచితుడు సినిమాని ఇప్పుడు హిందీలో రణ్వీర్ సింగ్ తో రీమేక్ చేయబోతున్నారు.

 ఇలా వరసగా సినిమాలని చేస్తున్న శంకర్ వీటిని ఎప్పటికి పూర్తి చెయ్యాలి అని టాక్ వినిపిస్తుంది. ఆయన ఒక్క సినిమాకే 2 సంవత్సరాలు కచ్చితంగా తీసుకుంటారు. అయితే ఇప్పుడు మూడు సినిమాలని ఎప్పటిలోపు పూర్తి చేస్తారు అనేది పెద్ద ప్రశ్న లాగా మిగిలింది. శంకర్ మాత్రం వచ్చే సంవత్సరం రణవీర్ సింగ్ సినిమా మొదలుపెట్టాలి అనుకుంటున్నాడు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: