చాలా సంవత్సరాల క్రితం వచ్చిన మలయాళం దృశ్యం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని చాలా భాషల్లో అదే పేరుతో రీమేక్ చేశారు.  తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాని రీమేక్ చేసి మంచి సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమాకి చాలా సంవత్సరాల తర్వాత సీక్వెల్ వచ్చింది అదే దృశ్యం2. ఈ సినిమాలో కూడా మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో కనిపించారు.  ఈ సినిమా  అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

సినిమా కి మంచి టాక్ రావడంతో అందరూ అమెజాన్ ప్రైమ్ లో చూసారు. ఇక ఈ తెలుగు సినిమా దృశ్యం 2 షూటింగ్ పూజ ఈ మద్యనే మొదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర తప్ప అన్ని మలయాళం సినిమాలోని పాత్రలు ఉంటాయి అని టాక్ అయితే ఈ సినిమా కూడా మొదటి సినిమాలాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో తెలియాలంటే  ఆగాల్సిందే. ఈ సినిమా షూటింగ్  రెగులర్ షూట్ మొదలయ్యింది.ఇక ఈ సినిమాని వెంకటేష్ ఒక్క నెలలో పూర్తి చేస్తాను అని ఆయన అన్నారు. అనుకున్నట్టుగానే వెంకీ ఈ సినిమాని ఒక్క నెలలో పూర్తి చేశారు.ఈరోజు తో దృశ్యం 2 సినిమాలో వెంకీ షూట్ పూర్తి అయింది.

ఈ సినిమాని కూడా ఒరిజినల్ సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా కొంచెం షూటింగ్ ఉన్న ఈ సినిమా త్వరలోనే పూర్తి చేసి జూన్ లో విడుదల చెయ్యాలి అని నిర్మాతలు అనుకుంటున్నారు.ఇక ఈ సినిమాతో పాటు వెంకీ నారప్ప , మరియు ఎఫ్3 సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. అయితే వెంకీ చేసే ఈ మూడు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలు అన్ని హిట్ అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: