పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయన ఏ పాత్ర చేసిన ఆ పాత్రకి ఒక పవర్ వస్తుంది. ఇక దాదాపు 3 సంవత్సరాల తరువాత వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సక్సెస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ పేరు మరలా బాగా ట్రెండ్ అవుతుంది.5 రోజుల్లో 70 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి వకీల్ సాబ్ మూవీ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో ప్రూవ్ చేసింది. ఇక గత కొన్ని నెలల నుంచి వరుసగా సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బందికి కరోనా సోకడంతో ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు.ఇక పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నా ఈ సినిమాలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సీమ స్లాంగ్ లో డైలాగులు చెబుతారని సమాచారం తెలుస్తోంది.ఇక సీమ బిడ్డగా పవన్ కళ్యాణ్ నటనకి ఆడియన్స్ ఫ్లాట్ అయిపోవడం ఖాయమట.ఖచ్చితంగా పవన్ రాయలసీమ వ్యక్తిగా ఆదరగోట్టడం ఖాయమట.ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమాకి కూడా తమన్ అదిరిపోయే సంగీతన్ని ఇస్తున్నాడట. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: