పవన్ కళ్యాణ్ తాజా చిత్రం వకీల్ సాబ్ ప్రస్తుతం విడుదలైన అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు ఆదరణ దక్కుతోంది. లాక్ డౌన్ లో రిలీజ్ అయిన అన్ని చిత్రాల కంటే వకీల్ సాబ్ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.వకీల్ సాబ్ చిత్రం తెలంగాణలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గత ఐదు రోజుల్లో చూస్తే 6వ రోజు వచ్చేసరికి రూ.25 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది.ఇక రాయలసీమ సీడెడ్ లో రూ.10 కోట్ల మార్కును 6వ రోజు అధిగమించింది. ఉత్తరాంధ్రలో కూడా ఊపు కొనసాగిస్తోంది.

 అక్కడ కూడా రూ.10 కోట్లు వసూళ్లతో దూసుకెళుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వసూళ్లు వస్తున్నాయి. ఏలూరు సిటీలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు మరో రెండు థియేటర్లు పెంచారు. వైజాగ్ లో 95శాతానికి పైగా అక్యూపెన్సీతో వకీల్ సాబ్ ఆడుతోంది.అమెరికాలో వకీల్ సాబ్ కలెక్షన్లు కొనసాగుతున్నాయి. మంగళవారం 160 థియేటర్లలో 16980 డాలర్లు వసూలు చేసింది. మొత్తం 702641 డాలర్లను వసూలు చేసింది.

ఆస్ట్రేలియా, సింగపూర్ లో కూడా వసూళ్లు రాబడుతోంది.లాక్ డౌన్ తర్వాత 100 కోట్ల క్లబ్ దాటేసిన చిత్రంగా రికార్డును సృష్టించింది. కరోనా టైంలోనూ పవన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం విశేషం. ప్రీరిలీజ్ బిజినెస్ లో 6వ రోజుకు 90శాతం రికవరీని సాధించింది.మొత్తం 6వ రోజు కలెక్షన్లు చూస్తే ఏపీలో రూ.15 కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం. తెలంగాణలో 25 కోట్ల మార్కును దాటేసింది. ఇక మొత్తం 100 కోట్లు దాటి పరిగెడుతోంది.ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం.. 6వ రోజుతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.110 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: