కరోనా కారణంగా సినిమా పరిశ్రమ దిక్కుతోచని స్థితి కి దిగజారిపోయింది. మొదటిదశలో థియేటర్లు మూసుకుపోతే రెండో దశలో కరోనా విస్తరణలో ఏం చేయాలో నిర్మాతలకు అర్థం కావట్లేదు.. ఎక్కడ థియేటర్లు క్లోజ్ అవుతాయో అని సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు నిర్మాతలు..ఇప్పటికే చాల సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి..చిన్నవే ఆనుకుంటే పెద్ద సినిమాలు కూడా, రిలీజ్ డేట్ చెప్పుకున్న సినిమా లు పోస్ట్ అయిపోయాయి..

యష్ హీరో గా నటించిన కేజీఎఫ్, రాజమౌళి rrr , ఆచార్య వంటి సినిమాలు సెకండ్ వేవ్ దెబ్బకి పోస్ట్ పోన్ అయ్యే ఆలోచనలో ఉన్నాయట.ఒక పెద్ద సినిమా వస్తోంది అంటేనే అటూ ఇటూ జరిగేందుకు ఎన్నో సినిమాలు ఇబ్బంది పడుతుంటాయి. ఇప్పుడు ఈ సినిమాలు రిలీజ్ వాయిదాలు అంటూ అన్ని పరిశ్రమల్లోనూ గందరగోళం నెలకొంటుంది. ఇక రాజమౌళి బృందం ఇప్పటికీ అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ కోసమే వేచి చూస్తున్నారు. అప్పటికి పరిస్థితులు పూర్తిగా సద్ధుమణుగుతాయనే ఆశిస్తున్నారు.

అయితే కేజీఎఫ్ 2 రిలీజ్ కి మాత్రం ఇంకో రెండు నెలల సమయమే మిగిలి ఉంది. ఈలోగానే పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తే ఫర్వాలేదు. అప్పటికి జనం తిరిగి జాగ్రత్తలతో కోలుకుంటారన్న ఆశాభావం టీమ్ లో ఉందిట. సెకండ్ వేవ్ కొద్దిరోజులే. ఉధృతంగా పెరిగే క్రమంలో చిన్నపాటి అనధికారిక లాక్ డౌన్ లు ప్రజల అవగాహన జాగ్రత్తతో ముప్పు నుంచి తిరిగి కోలుకునే వీలుంటుందని అంచనా వేస్తున్నారట. మరోవైపు ఆచార్య కూడా ఇదే ఆలోచిస్తుంది.ఇప్పటికే నాగ చైతన్య లవ్ స్టోరీ, నాని టక్ జగదీష్, ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం సినిమాలు పోస్ట్ పోన్ అవ్వగా మరికొన్ని సినిమాలు కూడా అందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఇంకా వెంకటేష్ నటించిన నారప్ప వంటి పెద్ద చిత్రాలు కూడా ఇప్పట్లో ధియేటర్లలోకి వచ్చేందుకు ఏమాత్రం సిద్ధం గా లేవు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: