ఈ మద్యే కాస్త కరోనా ప్రభావం తగ్గడంతో మళ్ళీ థియేటర్లు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ తీవ్రత తగ్గడంతో సినిమాలు విడుదల చేశారు. ఈ కరోనా కొనసాగుతున్నసమయంలోనే జాంబీ రెడ్డి, జాతిరత్నాలు, ఉప్పెన, క్రాక్ వంటి సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత తాజాగా పవర్ స్టార్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ విడుదలై రికార్డులను బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. ఇక పోతే ఇపుడు క్యూలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న నూతన చిత్రాల జాబితా చూస్తే..నాని మూవీ టక్ జగదీష్, నాగ చైతన్య చిత్రం లవ్ స్టోరీ ..ఆ తర్వాత భారీ ప్రతిష్టాత్మక చిత్రాలైన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో భారీగా రూపుదిద్దుకుంటున్న ఆర్ఆర్ఆర్ చిత్రం.

ఇలా ఈ సినిమాలన్నీ విడుదల కావాల్సిన లిస్ట్ లో ఉండగా...ఇపుడు సినీ దిగ్గజాలు వేసుకున్న లెక్కలన్నీ తారుమారు అవుతున్నాయి. మళ్ళీ కరోనా వైరస్ తిరగ బడడంతో సమస్య మొదటికొస్తోంది అన్న సూచనలు అందుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే జనాలు థియేటర్లకు వస్తారా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ప్రజల మాట అటుంచితే తిరిగి లాక్ డౌన్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ ,మే నెలలో రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలు వాయిదా పడుతున్నాయి. త్వరలో రిలీజ్ కావాల్సిన టక్ జగదీష్, లవ్ స్టోరీ సినిమాలు అనుకున్న సమయానికి కాకుండా తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అధికారకంగా ప్రకటించారు మేకర్స్.

అయితే ఇప్పుడు అందరి దృష్టి భారీ ప్రాజెక్టులైన ఆర్ఆర్ఆర్ మరియు కెజిఎఫ్ 2 చిత్రాలపై పడింది. అయితే 16 జూలై లో రిలీజ్ కి రానున్న కేజీఎఫ్ 2 కానీ.. అక్టోబర్ 13న రిలీజ్  కావాల్సిన ఆర్ఆర్ఆర్ కానీ వాయిదా పడితే  మాత్రం ఇండస్ట్రీపై భారీగా ప్రభావం చూపుతుందని  అంచనా వేస్తున్నారు సినీ  విశ్లేషకులు. ఒకవేళ ఇవి కనుక అనుకున్న రిలీజ్ డేట్ లకు కాకుండా పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే, ఇండస్ట్రీకి అది పెద్ద సమస్యాత్మకం అవుతుందని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే భారీ చిత్రాన్ని రిలీజ్ చేసే ముందు వెనుక చాలా విషయాలను లెక్క చూసుకోవాల్సి ఉంటుంది... ఏ సమయంలో విడుదల చేయాలి, చిన్న సినిమాలు ఏమైనా ఉన్నాయా, ఇలా ఎన్నో ఉంటాయి.


కాబట్టి వీటి విడుదలకు వాయిదా పడకూడదని ముందుగానే హెచ్చరిస్తున్నారు ఇండస్ట్రీ నిపుణులు. రాజమౌళి టీం ఆర్ఆర్ఆర్ విడుదలకి ఇప్పటికే అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ కోసమే వేచి చూస్తున్నారు. అప్పటికి పరిస్థితులు పూర్తిగా సద్ధుమణుగుతాయనే భావిస్తున్నారు. కానీ  కేజిఎఫ్ 2 చిత్రం విడుదలకి మాత్రం ఇంకో రెండు నెలలు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: