టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా దాసరి నారాయణ రావు గారు ఎంతగానో సేవలు అందించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఏ చిన్న కష్టం వచ్చినాగాని నేను ఉన్నాను అంటూ పెద్ద దిక్కుగా ఉండేవారు.కానీ ఆయన మరణానంతరం ఆ ఖాళీ స్పేస్ చాలా కాలం అలానే మిగిలిపోయింది. ఆ సమయంలో దాసరి బాధ్యతలను  మెగాస్టార్ చిరంజీవి చేపట్టారు. చిరు రాకతో పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఆయనతో సంప్రదింపులు ప్రారంభించారు. టాలీవుడ్ లో ఏ సమస్య వచ్చినా తొలిగా ఆయనతో చెప్పుకునేవారు. రకరకాల సందర్భాల్లో తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల్ని కలిసి పరిశ్రమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా మెగాస్టార్ పరిశ్రమ తరపున కోరారు. దానికి ఇరు ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారు.


ఇరు రాష్ట్రాల్లోనూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చిరు-నాగార్జున- మురళీమోహన్ - మోహన్ బావు- జయసుధ వంటి వంటి వాళ్ళు ఒక టీమ్ వర్క్ లాగా కూడా అండగా ఉండేవారు..అయితే ఇప్పుడు టాలీవుడ్ కి మళ్ళీ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అది ఏంటంటే ప్రస్తుత టిక్కెట్టు రేట్లు పదేళ్ల కనిష్ఠ స్థాయికి తగ్గించేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఈ ధరలతో థియేటర్లు నడపలేమని ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో బంద్ కి పిలుపునివ్వడం కూడా మనం వినే ఉంటాము.కనీసం టిక్కెట్టు ధర పెంచకపోయిన  మునుపటి ధరలు అయినా లేకపోతే ఎగ్జిబిషన్ రంగం మనుగడే ప్రశ్నార్థకం అవుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. మొన్నటికి మొన్న వకీల్ సాబ్ రిలీజ్ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయింది.


మునుముందు ప్రభుత్వ జీవో ప్రకారం వచ్చిన కొత్త రేట్లతో సినిమాలు ఆడించడం తీవ్ర నష్టాలకు కారణమవుతుందన్న ఆందోళన ఎగ్జిబిటర్లతో పాటు పరిశ్రమ పెద్దల్లోనూ ఉంది. అందుకే ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేందుకు మెగాస్టార్ పెద్దరికం వహిస్తారా? లేదా అంటూ చర్చ సాగుతోంది. ఆయన ముందుకొస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని నమ్ముతున్నారు. ఈ సమస్యను ఇక్కడితో ఈజీగా తీసుకుంటే మునుముందు పలు భారీ చిత్రాలు రిలీజ్ అవ్వనున్నాయి. ఆ చిత్రాలను దృష్టిలో పెంచుకుని  టిక్కెట్టు తగ్గింపుతో బయ్యర్లు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లతో పాటు నిర్మాతలు కూడా ఆందోళనలో ఉన్నారు. మరి చిరు త్వరగా రంగంలోకి దిగితే గాని వెంటనే సమస్య పరిష్కారం కాదని పరిశ్రమ వర్గాలోని వారు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: