పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మన తెలుగు స్టార్ హీరోలలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకడు. తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పటివరకు 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన సినిమా ఒక్కటి కూడా లేదు.పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ షేర్ రాబట్టిన సినిమా "అత్తారింటికి దారేది"మాత్రమే. కాని ఆ సినిమా కూడా 100 కోట్ల షేర్ అందుకోలేక 70 కోట్ల దాకే ఆగిపోయింది.ఇక టాలీవుడ్ లో 100 కోట్ల షేర్ అందుకున్న స్టార్స్ ముగ్గురే వారు ప్రభాస్, మహేష్, రామ్ చరణ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.


ఇక టాలీవుడ్ మార్కెట్ 100 కోట్లు దాటే సమయానికి పవన్ సినిమాలు తగ్గించడం, అజ్ఞాతవాసి సినిమా తరువాత సినిమాలకు గ్యాప్ ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ ఈ రికార్డును సొంతం చేసుకోలేకపోయారు.ఒకే వేళ గ్యాప్ ఇవ్వకుండా ఉంటే కథ వేరేగా ఉండేది.దాదాపు మూడు సంవత్సరాల విరామం తరువాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించగా ఈ సినిమాతో పవన్ కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారని ఈ సినిమాతో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తారని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.కాని ఇప్పుడున్న పరిస్థితుల వల్ల అది కష్టమేమో అనిపిస్తుంది.


వకీల్ సాబ్ తొలిరోజు నుంచే భారీగా కలెక్షన్లను సాధిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర వకీల్ సాబ్ కు పోటీనిచ్చే సినిమా ఏదీ లేకున్నా కాని వకీల్ సాబ్ జోరుకు కరోనా బ్రేకులు వేసే అవకాశాలు ఉన్నాయి. పెరుగుతున్న కరోనా కేసుల వల్ల థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. అయితే కేసులు పెరుగుతున్నా వకీల్ సాబ్ ఈ వీకెండ్ నాటికి 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి పవన్ సెంచరీ కొట్టి టాలీవుడ్ లో 100 కోట్లు షేర్ రాబట్టిన 4 వ హీరో అవుతాడో లేదో..


మరింత సమాచారం తెలుసుకోండి: