ప్రతి ఇండస్ట్రీలో కూడా హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోయే స్టార్ హీరోస్ వుంటారు. ఇక మన ఇండస్ట్రీలో కూడా అలాంటి స్టార్ హీరోస్ వున్నారు. అలాంటి వారిలో సీనియర్ స్టార్ హీరో నటసింహం బాల కృష్ణ కూడా ఒకడనే చెప్పాలి.ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరు. ఇప్పటికీ ఆయనకి అభిమానులు లక్షల్లో ఉన్నారు.ఆయన సినిమాలు ప్లాప్ అయినా కాని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు.ఇక అసలు విషయానికి వస్తే యంగ్ హీరోల సినిమాలతో పోలిస్తే.. సోషల్ మీడియాలో బాలయ్య సినిమాల గురించి పెద్దగా చర్చ ఉండదు. యూట్యూబ్ లో బాలయ్య సినిమా ట్రైలర్లు, టీజర్లు విడుదలైనప్పుడు వాటికొచ్చే వ్యూస్, లైక్స్ చాలా తక్కువగా ఉంటాయి. పెద్దగా ట్రెండ్ కూడా కావు.ఇక అయితే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న కొత్త సినిమా 'అఖండ' మాత్రం యూ ట్యూబ్ లో సంచలనాలు రేపుతుందనే చెప్పాలి. ఇంతకముందు విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రోర్ కి..తాజాగా విడుదలైన టీజర్ కి ఊహించని స్పందన వస్తోంది.


సోషల్ మీడియాలో ఎప్పుడూ లేని విధంగా బాలయ్య సినిమా టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 'అఖండ' టైటిల్ రోర్ 24 గంటల్లో 10 మిలియన్ వ్యూస్ ను సాధించింది.రెండు రోజులు పూర్తయ్యేసరికి 14 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. మూడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ టీజర్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇది బాలయ్య కెరీర్ లోనే అద్భుతమైన రికార్డు అని చెప్పాలి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో "సింహ","లెజెండ్" లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రావడంతో ఇప్పుడు ఈ మూడవ సినిమాపై కూడా అంచనాలు తారా స్థాయిలో వున్నాయి. ఇక ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే కొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయం. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: