ఇంటర్నెట్ డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ అంటే ఎవరో కూడా తనకు తెలియదని ఇంతకుముందు సంచలన కామెంట్లు చేసిన మెగా బ్రదర్ నాగబాబు.. తన వాట్సాప్ డీపీగా బాలకృష్ణ ఫోటో పెట్టుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడంతో ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న నాగబాబు.. తరచుగా నెటిజన్లతో లైవ్ చాట్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే వారడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన వాట్సాప్ డీపీ గురించి వెల్డించారు.

ఆన్‌లైన్ లైవ్ సెషన్‌లో భాగంగా.. ఒక నెటిజన్ నాగబాబును వాట్సాప్ డిస్ ప్లే పిక్చర్లో ఎవరి ఫోటో పెట్టుకున్నారని అడిగాడు. ఆ ప్రశ్నకుసమాధానంగా.. బాలకృష్ణ, రామ్ గోపాల్ వర్మ కలిసి దిగిన ఫోటోను నాగబాబు షేర్ చేశారు. దీంతో అవాక్కవడం నెటిజన్లు వంతైంది. అసలు బాలకృష్ణ పేరెత్తితేనే అంతెత్తున లేచే నాగబాబు.. ఆయన ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకోవడం ఏంటని..? కామెంట్లు చేస్తున్నారు. అయితే నాగబాబు నిజంగా బాలకృష్ణ ఫోటో పెట్టుకున్నారో లేదో తెలియాల్సి ఉంది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం.. నాగబాబు కావాలనే ఇలా వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మరో నెటిజన్ ‘మీది లవ్ మ్యారేజా.? అరేంజ్డ్ మ్యారేజా.?’ అని నాగబాబును ప్రశ్నించగా.. అరేంజ్డ్ మ్యారేడ్ అని ఆయన సమాధానమిచ్చారు. ఇష్టమైన ప్రదేశం ఏదనే ప్రశ్నకు..  న్యూజిలాండ్ అంటే తనకెంతో ఇష్టమని నాగబాబు సమాధానమిచ్చారు. బన్నీ ట్యాగ్ గురించి స్పందించిన నాగబాబు అల్లు అర్జున్‌కు స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ బాగుంటుందని పేర్కొన్నారు. అలాగే సాయిధరమ్ తేజ్ గురించి మాట్లాడుతూ.. అతడు ఇన్నోసెంట్ అండ్ హార్డ్ వర్కర్ అని కితాబిచ్చాడు.

వేర్వేరు అంశాలపై నాగబాబు స్పందిస్తుండగా నాగబాబు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలలో కొన్ని అభిప్రాయాలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం గమనార్హం. మరోవైపు నాగబాబు చేతిలో సినిమా ఆఫర్లు బాగానే ఉన్నాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో అరవింద సమేత సినిమా నాగబాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: