ఈ మధ్యకాలంలో యూట్యూబర్ల హవా రోజురోజుకూ పెరుగుతోంది. ఎంతోమంది యూట్యూబర్లు ఇక సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది ఎంతో ఫేమస్ అయిపోతున్నారు. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ తమలోని టాలెంట్ నిరూపించుకుని ఇక సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు.  ప్రస్తుతం ఇలా యూట్యూబ్ లో రాణించి ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో ఇక యూట్యూబ్ స్టార్ గా ఎదిగి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న గంగవ్వ కూడా ఒకరు.  మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గంగవ్వ ఇక అందరికీ అపరిచితురాలుగా మారిపోయింది.


 ఇక యూట్యూబ్లో గంగవ్వ హావ భావాలు మాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి.  ఇక తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించింది గంగవ్వ . కేవలం యూట్యూబ్ కి మాత్రమే పరిమితం కాకుండా ఇక ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుంది.  అయితే కనీసం చదువుకోని గంగవ్వ ఇక తనలోని టాలెంట్ తో ఏకంగా స్టార్ హీరోలు హీరోయిన్లను సైతం ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పటికే గతంలో ఏకంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అక్కినేని కోడలు సమంతను ఇంటర్వ్యూ చేసింది గంగవ్వ. ఇక ఇటీవల మరోసారి గంగవ్వ యూట్యూబ్లో హల్ చల్ చేస్తోంది.



 టాలీవుడ్లో దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్లు కొనసాగుతూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న తమన్నా ను ఇంటర్వ్యూ చేసింది యూట్యూబ్ స్టార్ గంగవ్వ. మై విలేజ్ షో లోని మరో నటుడు అయిన రాజు తో కలిసి స్టార్ హీరోయిన్ తమన్నా ను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే తమన్నాను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగింది గంగవ్వ. ఇటీవలే  ఇక ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదల కావడంతో వైరల్ గా మారిపోయింది.  అయితే గంగవ్వ తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ రచ్చ రచ్చ చేసింది అని చెప్పాలి.. గంగవ్వ అడిగిన ప్రశ్నలకు అటు తమన్నా కూడా ఎంతో కూల్గా తెలుగులోనే సమాధానం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: