మన టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు అభిమానులను సర్ప్రైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.. గిఫ్ట్ లు పంపించడం, ఫోటో షూట్ చేయడం, షూటింగ్ టైం లో కలవడం, ఆడియో ఫంక్షన్ లో వాళ్లని పలకరించడం వంటివి చేస్తూ అభిమానులు ఎప్పటికప్పుడూ ఉత్సాహపరుస్తూ ఉంటారు. కేవలం పేరుకు మాత్రమే కలవడం అని కాకుండా వారికి అప్పుడో ఇప్పుడో హెల్ప్ చేస్తూ తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు మన హీరోలు.. అయితే హీరోయిన్లు ఫ్యాన్స్ కి హెల్ప్ చేయడం మనం చాలా అరుదుగా చూస్తుంటాం.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత తాజా గా ఓ ఆటో డ్రైవర్ కి అందించింది.. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సమంతసినిమా సూపర్ హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు..

వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.. స్టార్ హీరోల అందరితో సినిమా చేసిన సమంత నాగచైతన్య పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.. నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత అక్కినేని కోడలిగా ప్రస్తుతం అక్కినేని అభిమానులను అలరిస్తుంది..  పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్న ఈ తరం హీరోయిన్ బహుశా సమంత ఒక్కరే కావచ్చు.. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు పెద్దగా లేకున్నా, ఓ వెబ్ సిరీస్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది..  హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్  తీసుకునే హీరోయిన్లలో సమంత ఒకరు..  అందం, అభినయం, హుషారు, చలాకి తనం అన్ని కలగలిపిన హీరోయిన్ సమంత అందుకే ఆమె ఇంత టాప్ హీరోయిన్ గా  వెలుగొందింది..

 తాజాగా ఆమె సంగారెడ్డి జిల్లా మణుగూరు మండలం దొవ్వూరు చందర్ నాయక్ తండా కు చెందిన ఆటోడ్రైవర్ కవితకు ఓడించడం బావమరిది అందజేసింది..ఓ షోరూం నుంచి  ఫోన్ కాల్ అందుకున్న కవిత ఈ విషయం తెలుసుకొని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.. వారు చెప్పిన వివరాల ప్రకారం షో రూమ్ కి వెళ్లగా నిర్వాహకులు ఆమెకు 12:30 లక్షల విలువచేసే స్విఫ్ట్ డిజైర్ కార్ ను అందజేశారు.. ఆరు నెలల క్రితం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో నిర్వహించిన ఓ ప్రైవేట్ ప్రోగ్రాం లో కవితకు ఆహ్వానం అందింది ఈమె జీవిత చరిత్ర నిర్వాహకులు యూట్యూబ్లో అప్ లోడ్ చేయగానే అది  చూసిన సమంత తనకు ఇలా గిఫ్ట్ ఇచ్చారని కవితా సంబరపడుతోంది.. కవిత గురించి చెప్పాలంటే చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో కుటుంబ పోషణ మరింత కష్టం అయింది.  అందుకే డ్రైవింగ్ నేర్చుకుని ఆటో నడుపుతూ హైదరాబాద్ వచ్చింది..  ప్రస్తుతం మియాపూర్ టు బాచుపల్లి దారిలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: