సమంత.. ఈ పేరుకి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు అనే చెప్పాలి. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుని దోచుకుంది. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఉన్నా టాలీవుడ్ హీరోయిన్స్ లో సమంత టాప్ హీరోయిన్ అనడంలో అతిశయోక్తి లేదు. తరువాత అక్కినేని నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది. పెళ్ళి అయినాగానీ అందం విషయంలో గాని, పెర్సనాలిటీ విషయంలో గాని ఈ మాత్రం మార్పు లేదు. అసలు సమంత ఇంత అందంగా ఉండడానికీ గల కారణం ఏంటి అని  చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే సామ్ అందానికి గల కారణం ఏంటి అనే రహస్యం ఇప్పుడు బయట పడింది. స్వయంగా సమంతానే తన అందం వెనుక ఉన్నా రహస్యాన్ని బయట పెట్టేసింది. తన అందం వెనుక ఉన్నా రహస్యం ఏంటంటే చందనం అని చెప్పుకొచ్చింది.


 తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత "గో టు నాచురల్" పదార్ధం గురించి తెలిపింది. తన సహజ అందానికి గంధపు చెక్క కారణం అని తెలిపింది. గంధపు చెక్కతో ఏంటి బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయని ఇవి చర్మాన్ని ఎల్లప్పుడూ కాపాడతాయని తెలిపింది. గంధపు చెక్క చర్మానికి ముడుతలు రాకుండా కాపాడుతుందని తెలిపింది. అలాగే ప్రీ రాడికల్స్ వలన కలిగే నష్టం నుంచి కాపాడుతుందని తెలిపింది. అలాగే కొన్ని చిట్కాలు కూడా తెలిపింది. చర్మం ప్రకాశవంతంగా ఉండాలంటే రోజ్వాటర్, గంధపుచెక్క రెండు  కూడా చాలా అవసరమని తెలిపింది.


కొద్దిగా గంధపు పొడిలో నాలుగైదు చుక్కలు రోజ్ వాటర్ ని కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని ఆ పేస్టుని ముఖానికి అలాగే మెడ భాగానికి రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇలాగే దోసకాయ రసంతో గంధపు పొడి కలిపి చర్మానికి రాసుకున్నట్లయితే జిడ్డు చర్మం  తొలగిపోతుంది అంట. అలాగే కొంచెం సెనగపిండి తీసుకుని అందులో కొద్దిగా గంధపు పొడిని, కొంచెం పసుపు, కొన్ని చుక్కలు రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుందని కొన్ని రకాల టిప్స్ చెప్పింది సమంత... !!

మరింత సమాచారం తెలుసుకోండి: