ఇంటర్నెట్ డెస్క్: తమిళ సూపర్‌ డైరెక్టర్‌ మురుగదాస్ స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. మురుగదాస్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా హై లెవెల్లోనే ఉన్నాయి. ఈ సినిమాను మురుగదాస్‌.. పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. అయితే ఇప్పటి వరకు సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? దీని కథ ఏంటి..? అనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ అప్‌డేట్ బయటకొచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు 1947 అనే టైటిల్‌‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్‌‌ బ్టటి చూస్తే ఈ సినిమా చారిత్రక నేపత్యంలో తెరకెక్కబోతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అసలే పాన్ ఇండియా సినిమా కాబట్టి.. ఉత్తరాదిన కూడా భారీ క్రేజ్ ఉన్న హీరోను ఎంపిక చేయాల్సి ఉంటుంది. తమిళ హీరోల్లో అలాంటి హీరోలు అంతగా పేరున్న వారు కనిపించకపోవడంతో ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్‌ హీరోను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల వారంటున్నారు.

ఈ సినిమాపై కోసం ఓ బడా బాలీవుడ్‌ నిర్మాత కూడా భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాడని సమాచారం. పాన్ ఇండియా సినిమా రేంజ్ లోనే ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అయితే పాన్‌ ఇండియా సినిమా లేదా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాను మురుగదాస్ ఇప్పటి వరకు చేయలేదు. మొదటిసారి ఈ సినిమాను ఆయన చేయబోతుండడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇదిలా ఉంటే మురుగదాస్ గత చిత్రం రజినీకాంత్‌‌తో చేశాడు. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. దీంతో ఈ సినిమా ఏ మాత్రం ఆడుతుందో అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: