టాలీవుడ్ బ్యాటీ అక్కినేని స‌మంత పెద్ద మ‌నుసు చాటుకుంది. తాజాగా స‌మంత ఓ నిరుపేద మ‌హిళా ఆటోడ్రైవ‌ర్ కు కారును గిఫ్ట్ గా ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా మ‌నూర్ మండ‌లం డోవూర్ చంద‌ర్ నాయ‌క్ తండాకు చెందిన క‌విత అనే మ‌హిళ భ‌ర్త వేదింపులు త‌ట్టుకోలేక ఒంట‌రి జీవితం గ‌డుపుతోంది. అంతే కాకుండా త‌ల్లి దండ్ర‌లు లేక‌పోవ‌డంతో క‌విత త‌న ఏడుగురు చెల్లెల్లను పోషించింది. ఇక కొంత కాలం వ‌ర‌కు ఊర్లో వ్య‌వ‌సాయం చేసిన క‌విత ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని బాచుప‌ల్లిలో ఆటో న‌డుపుతూ జీవ‌నం కొన‌సాగిస్తుంది. అయితే క‌విత జీవితం పై వ‌చ్చిన క‌థ‌నాలు ...యూట్యూబ్ వీడియోలు చూసి స‌మంత ఆమెకు స‌హాయం చేసిన‌ట్టు తెలుస్తుంది. ఆరునెల‌లుగా స‌మంత ఆటో డ్రైవ‌ర్ క‌విత లైఫ్ స్టోరీ తెలుసుకుని ఈ స‌హాయం చేసింది. దాదాపు ప‌న్నెండున్న‌ర ల‌క్ష‌లు విలువ చేసే షిఫ్ట్ డిజైర్ కారును స‌మంత క‌విత కు గిఫ్ట్ గా ఇచ్చింది. ఇటీవ‌లే బంజారాహిల్స్ షోరూం నుండి క‌విత కారును అందుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇక స‌మంత కారు గిఫ్ట్ గా ఇవ్వ‌డంతో క‌విత ఆనందానికి అవ‌దుల్లేకుండా పోయాయి. 

యూట్యూబ్ లో త‌న‌పై  వ‌చ్చిన క‌థ‌నాల‌ను చూసే స‌మంత త‌న‌కు కారును గిఫ్ట్ ఇచ్చింద‌ని క‌విత చెబుతుంది. అంతే కాకుండా స‌మంత చేసిన ప‌నికి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఇదిలా ఉండ‌గా స‌మంత ఏం మాయ చేశావే సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్లు అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. మ‌రో వైపు అక్కినేని వార‌సుడు నాగ చైత‌న్య‌ను వివాహ‌మాడి అక్కినేని కోడ‌ల‌య్యింది. ఇక ఇప్పుడు సినిమాల‌తో పాటు టీవీ షోలు వెబ్ సిరిస్ ల‌లో సైతం న‌టిస్తూ ఫుల్ బిజీ గా ఉంది. ముక్యంగా ఇప్పుడు స‌మంత గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటూ త‌న పాత్ర‌కు ప్ర‌ధాన్య‌త ఉన్న సినిమాల్లో మ‌రియు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో న‌టింస్తోంది. స‌మంత సినిమాల‌తో పాటు సేవాకార్య‌క్ర‌మాల్లో కూడా చురుకుగా పాల్గొనండంతో ఆ భామ‌ను బ్యూటీ విత్ గొల్డెన్ హార్ట్ అని అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: