అల వైకుంఠపురములో అంటూ 2020 సంక్రాంతికి ప్రేక్షకులకు ముందుకు వచ్చిన అల్లు అర్జున్ సినిమా రికార్డుల వేట ఆగడం లేదు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపిస్తూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. షేర్స్‌ విషయంలో  నాన్‌ బాహుబలి-2 రికార్డ్‌ను సొంతం చేసుకున్న ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రం ఇప్పటికి ఏదో ఒక విషయంలో రికార్డులు సెట్ చేస్తూ దుసుకెళ్లిపోతుంది. తాజాగా ఈ సినిమా మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

 తాజాగా అల వైకుంఠపురములో చిత్ర ఆల్బమ్ 200 కోట్ల వ్యూస్ సాధించి యూ ట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది.ఈ చిత్రానికి థమన్ అందించిన మ్యూజిక్ సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సామజవరగమనా, బుట్టబొమ్మ, రాములో రాములా సాంగ్స్ రికార్డులు క్రియేట్ చేశాయి. ఒక్కో సాంగ్ వంద మిలియన్స్‌కి పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డులు సృష్టించాయి. అలవైకుంఠపురములో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఏ తెలుగు సినిమా కూడా అందుకోని ఘనత యూట్యూబ్ లో అందుకుంది. ఈ చిత్రం నుంచి వచ్చిన వెర్షన్ పాటలకు గాను యూట్యూబ్ లో 2 బిలియన్ వ్యూస్ మార్క్ టచ్ అయ్యింది.

ఈ అరుదైన ఫీట్ ను అందుకున్న మొట్ట మొదటి చిత్రంగా ఇది నిలిచింది. దీనితో బన్నీ ఖాతాలో మరో అరుదైన అన్ బీటబుల్ రికార్డు పడిందని చెప్పాలి.ఈ సినిమా పాటలకు మొదటి నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాని బీట్ చేయడం ఇప్పట్లో మళ్ళీ కుదురకపోవచ్చు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో త్రివిక్రమ్ అయ్యప్పన్ కోషియన్ తెలుగు రీమేక్ కి మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక పూజ హెడ్గే బాలీవుడ్ లో మరియు టాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తు బిజీగా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: