టాలీవుడ్ కి మళ్లీ చెడ్డ రోజులు దాపురించాయిలా ఉంది. ఇప్పటికే సినిమా రిలీజ్ లకు ఇబ్బందులు పడుతూంటే రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూంటే ఇండస్ట్రీ అష్టకష్టాలు పడుతోంది. అది చాలదు అన్నట్లుగా ఇపుడు కరోనా సెకండ్ వేవ్ దారుణంగా కమ్ముకుని టాలీవుడ్ ని తెగ ఇబ్బంది పెడుతోంది.

కరోనా సెకండ్ వేవ్ తో మొదట సినిమా రిలీజ్ లకు బ్రేక్ పడుతోంది. వకీల్ సాబ్ తరువాత పెద్ద సినిమాలు, మీడియం రేంజి సినిమాలు కూడా థియేటర్లకు వచ్చేందుకు భయపడుతున్నాయి. దానికి కారణం కరోనా రెండవ దశ విపరీతంగా ఉండడమే. కరోనా కారణంగా జనాలు సినిమా హాళ్ళకు రారు అన్న కంగారు ఒక వైపు ఉంది. మరో వైపు చూసుకుంటే ప్రభుత్వాలు కూడా కట్టడి చేస్తున్నాయి. చాలా రాష్ట్రాలలో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అమలులోకి వచ్చింది. ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో దాన్ని అమలు చేస్తారు అంటున్నారు. ఇంకో వైపు చూస్తే టాలీవుడ్ ప్రముఖులు అంతా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో రానున్న ఆరు వారాలు కరోనా సెకండ్ వేవ్ ధాటీగా ఉంటుంది అంటున్నారు. ఈ పరిణామాలతో టాలీవుడ్ లో షూటింగునకు పెద్ద బ్రేక్ పడేలా కనిపిస్తోందిట.

ఇప్పటికే షూటింగ్ స్పాట్స్ కి వచ్చేవారు అంతా కరోనా భయంతో జడుసుకుంటున్నారుట. మరో వైపు ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి షూటింగ్ విషయంలో కొత్త ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో దాని కంటే ముందే కరోనా విషయంలో తమ వంతు కట్టడి ప్రయత్నాలను మొదలెట్టాలని చూస్తున్నారుట. అందువల్ల తొందరలోనే సినీ ప్రముఖులు అంతా కూర్చుని షూటింగులకు కొన్నాళ్ళు బ్రేక్ వేసేలా నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న చాలా సినిమాలు మాత్రం  ఆగిపోయేలా ఉన్నాయి. దాంతో రిలీజ్ డేట్స్ కూడా మారుతాయి అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: