తమిళ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీ కి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. తన అన్న లాగే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడు కార్తీ."యుగానికి ఒక్కడు", ఆవారా", "నా పేరు శివ" సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాడు. ఇక ఆ సినిమా తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్న కార్తీ ఎలాంటి అంచనాలు లేకుండా "ఖైదీ" సినిమాతో ఎవరూ ఊహించని విధంగా హిట్ ని అందుకోని మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ 'సుల్తాన్'.


రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. 'డ్రీమ్ వారియర్ పిక్చర్స్' బ్యానర్ పై యస్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, యస్‌.ఆర్‌.ప్రభు.. లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది.అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. కానీ వీక్ డేస్ లో సత్తా చాట లేక ఈ సినిమా తేలిపోయింది. ముఖ్యంగా కార్తీ నటన బాగున్నా కాని రష్మిక మందన ఓవర్ యాక్షన్ వల్ల ఈ సినిమా ఎవరికి సరిగ్గా నచ్చలేదట.ఇక ఈ సినిమా కార్తీ కెరీర్ కే పెద్ద మచ్చలా తయారైంది. ఇక 'సుల్తాన్' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 6.5కోట్ల షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 3.54 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే బయ్యర్లకు 2.96కోట్ల నష్టాన్ని మిగిల్చిందన్న మాట. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగానే ఈ సినిమాకి ఎఫెక్ట్ పడినట్టు స్పష్టమవుతుంది.ఇక చూడాలి కార్తికి ఖైదీ లాంటి కమ్ బ్యాక్ హిట్ లభిస్తుందో లేదో...

మరింత సమాచారం తెలుసుకోండి: