శంకర్ తెరకెక్కించిన కలాఖండాలలో "భారతీయుడు" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఇక ఇన్నేళ్లకు దానికి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. 'ఇండియన్ 2' సినిమాను మొదలుపెట్టిన దగ్గర నుండి ఏదొక అవతారం ఏర్పడుతూనే ఉంది. మధ్యలో సినిమా షూటింగ్ ఆగిపోయే పరిస్థితి కలిగింది. ఈ సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కి గొడవలు, కోర్టు కేసులు మొదలయ్యాయి. ఇంతలో శంకర్.. రామ్ చరణ్ హీరోగా సినిమా అనౌన్స్ చేయడంతో గొడవ మరింత ముదిరింది. లైకా నిర్మాతలు 'ఇండియన్ 2' సినిమా పూర్తయ్యేంత వరకు శంకర్ మరో సినిమా చేయడానికి వీల్లేదని కోర్టుకెళ్లారు. ఇదిలా ఉంటే.. తాజాగా శంకర్ 'అపరిచితుడు' రీమేక్ కూడా ప్రకటించేసాడు.ఇక ఈ సినిమాలు ప్రకటించగానే శంకర్ ఇండియన్ 2 సినిమాని చెయ్యాడేమో అని అనుమానాలు వచ్చాయి. కాని  'ఇండియన్ 2' సినిమా మాత్రం ఆగిపోలేదట. ఈ సినిమా తప్పకుండా పూర్తవుతుందని శంకర్ చెబుతున్నారు.


ఈ సినిమాను పూర్తి చేసిన తరువాత శంకర్ మిగిలిన సినిమాలను మొదలుపెట్టకూడదని లైకా కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై చెన్నై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ సినిమా కోసం విదేశీ నిపుణులు రావాల్సివుందని.. కోవిడ్ కారణంగా వాళ్లు ఇండియాకు రావడానికి భయపడుతున్నారని.. వాళ్లొచ్చిన వెంటనే షూటింగ్ యధావిధిగా మొదలవుతుందని శంకర్ తరపు న్యాయవాది కోర్టుకి చెప్పారు.జూన్ నుండి కమల్ హాసన్ డేట్లు ఇచ్చే అవకాశం ఉందని.. ఆయన ఓకే చెప్పిన వెంటనే షూటింగ్ మొదలవుతుందని న్యాయవాది కోర్టుకి తెలిపారు. జూన్ లో సినిమాను మొదలుపెట్టడానికి లైకా నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారని సమాచారం. అలానే విదేశీ నిపుణుల్ని ఇండియాకు రప్పించే బాధ్యత శంకర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్ని గొడవలు వచ్చినా.. 'ఇండియన్ 2' సినిమాతో శంకర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యటం ఖాయమట....

మరింత సమాచారం తెలుసుకోండి: