పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఆయన ఫ్యాన్స్ కూడా ఎన్నటికి మరిచిపోలేని సినిమా "గబ్బర్ సింగ్" అనే చెప్పాలి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో ప్లాపుల తరువాత పవన్ కళ్యాణ్ పని అయిపోయిందా అని జనాలు అనుకునే టైం లో ఈ సినిమా విడుదల అయ్యి కేవలం హిట్ మాత్రమే అవ్వకుండా అప్పటిదాకా వున్న ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి పవన్ కి మంచి కమ్ బ్యాక్ ఇచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.హరీశ్‌ శంకర్‌ డైరక్షన్‌లో పవన్‌ సినిమా అనగానే పవన్‌ అభిమానులు మాత్రం చాలా ఆనందపడ్డారు. కారణం 'గబ్బర్‌సింగ్'లో పవన్‌ను హరీశ్‌ శంకర్‌ చూపించిన తీరే. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ పని చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్‌ అవుతోంది.


హరీశ్‌ శంకర్‌ ఇప్పటికే పవన్‌ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు చేస్తున్నాడు. ఆ క్రమంలో సినిమా పవన్‌ ఐబీ ఆఫీసర్‌ అని వార్తలు వచ్చాయి.ఈ సినిమాలో పవన్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడని మరో పుకారు మొదలైంది. ఇదే నిజమైతే పవన్‌ కెరీర్‌లో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో 'తీన్‌మార్‌'లో పవన్‌ డబుల్‌ రోల్‌లో కనిపించాడు. అయితే ఆ సినిమాలో రెండు పాత్రలను ఒకేసారి చూసే అవకాశం ఉండదు. కానీ హరీశ్‌ శంకర్‌ సినిమాలో ఆ అవకాశం ఉందట.పవన్‌ కల్యాణ్‌ 28వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపిస్తాడట. ఒక పాత్ర పోలీసు అయితే, రెండో పాత్ర ఐబీ ఆఫీసర్‌ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ కి ఎన్నడూ గుర్తిండిపోతుంది. గబ్బర్ సింగ్ ని మరిచిపోయేలా హరీష్ ఈ సినిమాని తెరాకెక్కిస్తున్నాడట..

మరింత సమాచారం తెలుసుకోండి: