తెలుగు సినిమా పరిశ్రమలో మంచి నటుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారిలో నట విరాట్ రావు గోపాల్ రావు కూడా ఒకరు. కాకినాడ వద్ద గల గంగనపల్లి లో జన్మించిన రావు గోపాల్ రావు యుక్త వయసులో పలు నాటకాల్లో పాల్గొన్నారు. ఆపై సినిమాల మీద మక్కువతో చెన్న వెళ్ళిపోయిన రావు గోపాలరావు 1966లో వచ్చిన భక్త పోతన సినిమా ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఆ తరువాత నటుడిగా మనుషు మారాలి సినిమాలో పని చేసిన రావుగోపాలరావు ఆపై పలు సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ కొనసాగారు. అయితే నటుడిగా ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ముత్యాలముగ్గు. ఆ సినిమాలో విలన్ గా రావు గోపాల్ రావు పోషించిన పాత్ర కి ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.

బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీధర్ సంగీత హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగినా రావు గోపాల రావు అప్పటి టాలీవుడ్ స్టార్ నటులు అందరితో కూడా పనిచేశారు. మొదటి తరం విలన్ లైన రాజనాల, నాగభూషణం తరువాత రెండో తరంలో విలన్ గా రావు గోపాలరావు ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసి మంచి పేరు గడించారు. ఇక ప్రస్తుతం ఆయన తనయుడు రావురమేష్ పలు సినిమాలు చేస్తూ నటుడిగా మంచి పేరుతో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అసలు విషయం ఏమిటంటే ప్రముఖ నటి అన్నపూర్ణ ఇటీవల ఒకానొక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ మిగతా నటులతో పోలిస్తే రావు గోపాల రావు లో ఒక ప్రత్యేకత ఉందని ముఖ్యంగా ఆయన ఇంటి నుంచి చాలా పెద్ద క్యారేజి భోజన విరామ సమయంలో వచ్చేదని, అనంతరం యూనిట్ లోని ప్రతి ఒక్కరికి కూడా ఆయన దగ్గరుండి భోజనం వడ్డించేవారిని అలానే కడుపునిండా తినే వరకు వదిలేవారు కాదని ఏదైనా కూర బాగోకపోయినా చెప్పమని చక్కగా అడిగేవారని అన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని తన సొంత వారుగా భావించే రావుగోపాలరావు వంటి గొప్ప నటుడిగా పనిచేయటం తన అదృష్టం అని చెప్పుకొచ్చారు అన్నపూర్ణ......!!

మరింత సమాచారం తెలుసుకోండి: