తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం అత్యధిక వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న భారీ సినిమా రౌద్రం రణం రుధిరం. ఆర్ఆర్ఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా చరణ్ ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర చేస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా దానయ్య ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. కేకే సెంథిల్కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.

భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని. టాక్. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుంది. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం మన దేశం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ మహమ్మారి విస్తృతంగా కొనసాగుతుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలని ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాయి. మరోవైపు దీని ప్రభావం సినిమా థియేటర్స్ మీద కూడా పడుతోందని టాక్. మొన్నటి వరకు పెద్దగా జంకు లేకుండా థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకుడు ఇకపై సినిమాలు చూడటానికి వచ్చేందుకు ఒకింత జంకుతున్నారు.

అలానే రోజురోజుకీ కేసులు పెరిగిపోతుండటంతో సినిమాలు ఒక దాని వెంట మరొకటి షూటింగ్స్ వాయిదాలు పడుతున్నాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి జూలై, ఆగస్టులో విడుదల కావాల్సిన పలు సినిమాలు దసరాకు వాయిదా పడే అవకాశం ఉందని ఒకవేళ అదే గనక జరిగితే ఆ పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ ని మరొక మూడు నెలలు వాయిదా వేసి 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని వరకు వెయిట్ చెయ్ తప్పదని అంటున్నారు విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: