ఇక ఇండస్ట్రీలో కొన్ని సినిమాలను డైరెక్టర్స్ ఎన్నో అంచనాలతో తెరకెక్కిస్తారు. అవి పెద్ద హిట్లు అవుతాయి అనే ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా తొందరగా తెరకెక్కించి విడుదల చేస్తుంటారు. ఇక కొన్నిసార్లు మన స్టార్ హీరోల సినిమా వేడుకల్లో డైరెక్టర్లు అలాగే ఆ సినిమాలో నటించిన నటీనటుల ఇచ్చే స్పీచ్ లు వివేకానంద స్వామీ రేంజిలో ఉంటాయి. ఆ రేంజిలో సినిమా గురించి చెబుతూ అవతార్ రేంజిలో సినిమా హిట్ అవుతుందని ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తారు. ఇక వాటిని గుడ్డిగా నమ్మి సినిమాకి వెళ్లిన కొన్ని సార్లు.. 'వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా' అంటూ నెత్తిన కొట్టుకుని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకల్లో అవి కూడా స్టార్ హీరోల సినిమాల వేడుకల్లో మన డైరెక్టర్లు స్వామీ వివేకానంద రేంజిలో స్పీచ్ లు ఇచ్చి తమ పరువుని అడ్డంగా పోగొట్టుకున్నారు.


ముందుగా మెహర్ రమేష్ స్పీచ్ గురించి మాట్లాడుకుందాం.ఈయన స్పీచ్ నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పెద్ద పీడ కల లాంటిదనే చెప్పాలి.శక్తి ఆడియో రిలీజ్ వేడుకలో డైరెక్టర్ మెహర్ రమేష్ స్పీచ్ ఉంటుంది. నిజంగా ఆ స్పీచ్ వింటే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని ఎవ్వరైనా నమ్మేస్తారు. కానీ అది నమ్మి సినిమాకి వెళ్లిన జనాలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫలితంగా ఆ సినిమా డిజాస్టర్ అయ్యి మెహర్ రమేష్ పరువు అడ్డంగా తీసింది..


ఇక పవన్ - త్రివిక్రమ్ కాంబో అంటే ఆ హైప్ ఒక రేంజిలో ఉంటుంది. ఎందుకంటే 'జల్సా' వంటి హిట్, 'అత్తారింటికి దారేది' వంటి ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి వీరి కలయికలో 'అజ్ఞాతవాసి' మూడవ సినిమా కాబట్టి ఇక దర్శకుడు త్రివిక్రమ్ స్వామీ వివేకానంద రేంజిలో స్పీచ్ ఇచ్చాడు.. 'ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు' అనే మాట చెప్పి అభిమానులని పిచ్చెక్కించాడు. ఆ పిచ్చితో అజ్ఞాతవాసి సినిమా చూసిన అభిమానులకి నిజంగానే పిచ్చి పట్టే అంత పరిస్థితి వచ్చింది. సినిమా డిజాస్టర్ అయ్యింది. గురూజీ పరువు అడ్డంగా పోయింది.


'గుండె మీద చెయ్యి వేసుకుని సినిమాకి వెళ్ళండి' .. దర్శకుడు బోయపాటి చెప్పిన డైలాగ్ ఇది. దీని బాబు లాంటి సినిమా చేద్దాం' బాబు అంటూ ప్రమోషన్లో మరో డైలాగ్. ఈ స్పీచ్ లకు ఎలాంటి అనుభవం ఎదురైందో 'వినయ విధేయ రామ' నిరూపించింది.ఇక ఈ సినిమా స్పీచ్ తో కూడా బోయపాటి పరువు అడ్డంగా పోయి మీమర్స్ కి ఈ సినిమా ఫుల్ స్టఫ్ అయ్యింది...

మరింత సమాచారం తెలుసుకోండి: