ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్  వైరస్ తీవ్రత మరింత వేగంగా విజృంభిస్తుంది. గత ఏడాది ఇదే సమయంలో ఫస్ట్ వేవ్ కరోనా వైరస్ వ్యాపించగా.. మళ్లీ ఈ ఏడాది ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒక రోజులో సగటున ఊహించిన దానికంటే ఎక్కువగా కేసు నమోదు అవుతున్నాయి. అయితే ఇప్పటికే చాలావరకు కేసులు పెరుగుతున్న క్రమంలో.. సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది నటీనటులకు వైరస్ సోకింది. అంతేకాకుండా సినిమాలను, సినిమా షూటింగ్ లను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కోవిడ్ టెస్ట్ లను చేయించుకున్నాడని తెలుస్తుంది.




అయితే ఇటీవలే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా గురించి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ లీడ్ పాత్రలో నటించగా.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రపంచంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత  ప్రారంభమవుతుండగా.. ఈ సినిమా విడుదల వరకు ఈ సినీ బృందం లో పలువురికి వైరస్ సోకింది.ఇక ఈ సమయంలో సిని బృందానికి కాకుండా తన భద్రతా సిబ్బంది లో కూడా వైరస్ పాజిటివ్ తేలిందని తెలియడంతో వెంటనే పవన్ కూడా అనుమానంతో క్వారంటైన్ లోకి వెళ్ళాడు.



అయితే ప్రస్తుతం కరోనా సోకింది అంటేనే దగ్గరకు బంధుమిత్రులు సైతం రావడానికి భయపడుతున్నారు.అలాంటిది తన హీరోకి కరోనా సోకింది అంటూ దగ్గర నుండి సహాయం చేస్తున్నాడు నిర్మాత.కానీ ఇది అందుకు పూర్తి భిన్నమైనది. తన హీరోకి కరోనా సోకింది అనగానే దూరంగా పారిపోకుండా సదరు నిర్మాత దగ్గరుండి సాయం చేస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లడమే గాక సీటీ స్కాన్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. కంటికి రెప్పలా చూసుకున్నారు. పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్న నిర్మాత నాగ వంశీ సాహసమిది.




 ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ పనుల్లో ఉన్న నాగవంశీ పవన్ కి కోవిడ్ సోకిందని తెలియగానే ఆయన వెంటే ఉండి ఆశ్చర్యపరిచారు.కోవిడ్ సోకింది అనగానే అయినవాళ్లే దూరమైపోతుంటే అతడు గట్సీగా తన హీరో వెంట నిలిచారు. ఇలాంటి విలువలు ఈరోజులలో అందరికీ అవసరం. వంశీ భార్యకు ఇంతకుముందు కోవిడ్ సోకగా ఆమె చికిత్సతో కోలుకున్నారు. మహమ్మారీతో సహజీవనానికి అలవాటు పడాల్సిన సన్నివేశం ఉందన్న సంకేతాన్ని ఈ ఉదంతం ఇండస్ట్రీ వర్గాలకు అర్థమయ్యేలా చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: