ప‌వ‌న్ మాజీ భార్య రేణూదేశాయ్ హీరోయిన్ గా న‌టించిన్ప‌టికీ ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య‌గానే ఎక్కువ పాపుల‌ర్ అయ్యారు. బ‌ద్రి సినిమాలో ప‌వ‌న్ రేణూ దేశాయ్ హీరోహీరోయిన్ లు గా న‌టించి అల‌రించారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమగా మార‌డంతో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏవో కార‌ణాల వ‌ల్ల ఇద్దరూ విడిపోవాల్సివ‌చ్చింది. విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఇద్ద‌రు కూడా భ‌య‌ట‌కు చెప్ప‌లేదు. ఇక ప్ర‌స్తుతం ఎవ‌రి జీవితంలో వాళ్లు బిజీ అయ్యారు. ప‌వ‌న్ ఓ వైపు సినిమాల‌తో పాటు రాజ‌కీయాల్లో చురుకుగా ఉండ‌గా రేణూ దేశాయ్ పిల్ల‌ల‌తో క‌లిసి పూణేలో ఉంటుంది. అంతే కాకుండా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను సైతం మొద‌లు పెట్టింది. ఒక సినిమాకు సైతం ద‌ర్శ‌క‌త్వం వహిస్తుంది. అయితే రేణూ దేశాయ్ అప్ప‌ట్లో మ‌రో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు వెల్ల‌డించింది. అంతే కాకుండాఓ వ్య‌క్తితో ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది. అయితే ఆ వ్య‌క్తి ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఆమె వెల్ల‌డించ‌లేదు.

ఇక రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పినప్పుడు ప‌వ‌న్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్ప‌డిన‌ట్టు రేణూ దేశాయ్ వెల్ల‌డించింది. త‌న జీవితం త‌న ఇష్ట‌మని చెప్ప‌డానికి మీరెవ‌రు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇక ఇటీవ‌ల కూడా సోష‌ల్ మీడియాలో లైవ్ లోకి వ‌చ్చిన‌ప్పుడు ఓ అభిమాని ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి అడ‌గ్గా...ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి మాట్లాడ‌మంటారు. మాట్లాడితే ఫ్యాన్స్ తిర‌డ‌తారు అంటూ కామెంట్స్ చేసింది. అయితే గ‌తంలో నిశ్చితార్థం జ‌రిగిన‌ప్ప‌టికీ రేణూ దేశాయ్ పెళ్లి పై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. రేణూ దేశాయ్ కూడా మ‌ళ్లీ ఎప్పుడూ పెళ్లి గురించి మాట్లాడ‌లేదు. అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ లో రేణూ దేశాయ్ ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో త‌న వేలికి ఉన్న డైమండ్ రింగ్ ను రేణూ దేశాయ్ షేర్ చేసింది అంతే కాకుండా మ‌రో పోస్ట్ లో ఈ ప్ర‌పంచంతో ప‌నిలేద‌ని పేర్కొంది. ఇక ఈ పోస్ట్ తో రేణూ దేశాయ్ పెళ్ళి వార్త మ‌ళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: