2019 సంక్రాంతికి వినయ విధేయ రామ అనేక భారీ డిజాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ తేజ ఇప్పుడు రెండు బ్లాక్ బస్టర్ సినిమాల్లో భాగం అయ్యారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. అలాగే తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా సిద్ధ అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఈయనకు అలియా భట్ కు మధ్య కొన్ని సీన్స్ చిత్రీకరణ చేయాల్సి ఉంది. అలియా భట్ కు కరోనా సోకకుండా ఉండి ఉంటే ఈ పాటికి ఆ సీన్స్ చిత్రీకరణ పూర్తయ్యేవి. 

అయితే అనూహ్యంగా ఆమెకు కరోనా సోకడంతో ఆమె ఇచ్చిన డేట్స్ అన్నీ పనికిరాకుండా పోయాయి. దీంతో ఈ సినిమా కోసం మళ్లీ డేట్స్ కేటాయించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ గత పది పదిహేను రోజుల నుంచి షూటింగ్ లేకుండా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఈ నేపథ్యంలోనే ఆయన ఆచార్య లో తన నా పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయమని కొరటాల శివ కోరినట్లు సమాచారం. ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా వీలైనంత త్వరగా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 మే నెల చివరి లోపు ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి జూన్ నెల మొదటి నుంచి శంకర్ సినిమా కోసం వర్కౌట్స్ మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని రామ్ చరణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి రాజమౌళి సినిమా కోసం రామ్ చరణ్ ఇప్పటికే రెండేళ్ల దాకా సమయం ఇచ్చారు. అయితే కరోనా ఎంటర్ కావడంతో అనేక అనేక మార్పులు జరిగి ఈ సినిమా అంతకంతకు వెనక్కు వెళుతోంది. అయితే తన వరకు షూటింగ్ పూర్తి చేసి ఉంటే తాను వేరే పాత్ర కోసం వర్కౌట్ చేయొచ్చని రాజమౌళిని రామ్ చరణ్ కోరినట్టు చెబుతున్నారు. ఒక్కసారి అలియా బట్ డేట్స్ దొరికితే ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ షూటింగ్ పూర్తవుతుంది అట.

మరింత సమాచారం తెలుసుకోండి: