పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై 10రోజులు దాటి పోవడంతో ఈ మూవీ ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది అన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో ఫస్ట్ వీక్ లో మంచి వసూళ్ళు రాబట్టి రెండో వారంలో అడుగుపెట్టిన పరిస్థితులలో ఈ మూవీ కలెక్షన్స్ ఇప్పుడు భారీగా డ్రాప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.


అధికారికంగా లెక్కలు వెల్లడించనప్పటికీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందని పవన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా అని ప్రచారం జరుగుతోంది అయితే వాస్తవం వేరు అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బాగున్నా నాలుగోరోజు నుంచి వసూళ్ళు భారీగా తగ్గిపోయాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  ముఖ్యంగా మహిళలను  థియేటర్లకు రప్పించాలనే విధంగా ‘వకీల్ సాబ్’ ప్రమోషన్స్ చేశారు అయితే ఆ విషయాన్ని మహిళలు ఏమాత్రం పట్టించుకోలేదు అని అంటున్నారు.    


ఉదాతమైన ఈ మూవీ కధకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఇది మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమా అని వివిధ రంగాలలో ప్రముఖ  స్థానంలో ఉన్న మహిళలు చేపినప్పటికి ఈ మూవీని ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేకషకులు వచ్చి సినిమాను చూసేందుకు ఆశక్తి కనపరచక పోవడంతో ఈ మూవీ కలక్షన్స్ పూర్తిగా పడిపోయాయి అన్న వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ స్ట్రాటజీ కలిసొచ్చి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఉంటే ఈ మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ తో ఇప్పటికే 200 కోట్ల మూవీగా మారి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  


ఈ మూవీకి ఇప్పటి వరకు అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్ కూడ రాకపోవడం అత్యంత ఆశ్చర్యంగా ఉంది. ఒక వైపు పెరిగిపోతున్న కారోనా కేసులు మరో వైపు థియేటర్స్ మూత పడే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితులలో ఈ మూవీ బయ్యర్లకు నష్టాలు తప్పవు అన్న మాటలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: