నందమూరి బాలకృష్ణ సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్ ఆయన డైలాగులు, ఫైట్ సీన్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ప్రేక్షకులు అయితే బాలయ్య పవర్ ఫుల్ డైలాగుల కోసమే సినిమాలకు వెళుతుంటారు. తొడ కొట్టడం...మీసం తిప్పడాన్ని పరిశ్రమకు పరిచయం చేసిందే బాలయ్య. ఇక ఆయనను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ మరియు ఇతర సౌత్ రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు సైతం బాలయ్య సినిమాలను ఎంజాయ్ చేయడం విశేషం. ఇదిలా ఉండగా శనివారం గుండె పోటు తో మరణించిన తమిళ నటుడు వివేక్ కు బాలయ్య డైలాగులు, ఫైట్ సీన్లు అంటే ఇష్టమట. అంతే కాకుండా ఆయన లో గా ఫీల్ అయినప్పుడు బాలయ్య డైలాగులు వినటం లేదా ఫైట్ లు చూడటం వల్ల ఎనర్జీ వచ్చెదట. ఈ విషయాన్ని 2017 లో వివేక్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. బాలయ్య వీడియోలు చూడటం లేదంటే స్వామి వివేకానంద బుక్స్ చదివేవారట. 

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా వివేక్ మరణం తో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన లేని లోటు తీర్చలేనిదని పలువురు సంతాపం ప్రకటించారు. హీరో సిద్ధార్థ్, నటి కీర్తి సురేష్, చియాన్ విక్రమ్ సహా పలువురు నటీనటులు ఆయన  అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు. ఇక వివేక్ దాదాపు మూడు వందలకు పైగానే సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో తెలుగు వారికి వివేక్ పరిచయం అయ్యారు. ఆయన కామెడీ టైమింగ్ కు తెలుగు వాళ్ళు సైతం కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా తో పాటు వివేక్ రజిని కాంత్ హీరోగా వచ్చిన శివాజీ, సూర్య హీరోగా వచ్చిన సింగం సిరీస్ లలో నటించి అలరించారు.కొన్నేళ్ల కిందట వివేక్ కొడుకు మరియు తల్లి మరణించినట్లు తెలుతోంది. అప్పటి నుండే వివేక్ కృంగిపోయారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక వివేక్ నటించిన సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. దాంతో మరణానంతరం కూడా బ్రతికే ఉన్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: