తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్స్ కి మంచి గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు ఈ మధ్యకాలంలో వచ్చిన కమెడియన్స్ తో వచ్చింది కాదు.. అప్పట్లో ప్రముఖ కమెడియన్ రేలంగికి హీరోల కంటే ఎక్కవ డిమాండ్ ఉండేదని అందరు చెబుతుంటారు. కమెడియన్స్ వారి నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ర్వాత కాలంలో కూడా కమెడియన్స్ మంచి గుర్తింపుతో పాటు కొందరు కమెడియన్స్ హీరోలుగా రాణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అయితే అప్పట్లో రాజబాబు కమెడియన్ గా రాణిస్తూనే హీరోలా తెరపై కనిపించరు. ఇక ఆ తర్వాత బ్రహ్మానందం కూడా హీరోలుగా వేశారు. అలాగే యమలీల సినిమాతో అలీ హీరోగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా మరికొన్ని సినిమాలు చేసిన అలీ ప్రస్తుతం కమెడియన్ గానే ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇక సునీల్ కూడా హీరోగా ఓ వెలుగు వెలిగి మళ్ళీ కమెడియన్ వేషాలు వేస్తున్నాడు.

సునీల్ మల్టీ టాలెంటెడ్ కమెడియన్. ఇక సునీల్ హీరోగా నటించిన మర్యాదరామన్న హిట్ కావడంతో వరుస సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి. అయితే కొన్ని అనుకోకుండా దక్కాయి. ఇక ఆయన చేసిన సినిమాలో అందాలరాముడు మూవీ ఒకటి. ఇది కమెడియన్ సునీల్ నటించిన మొదటి సినిమా. అయితే ఈ సినిమానికి ముందుగా బ్రహ్మాజీని హీరోగా తీసుకోవాలని భావించారట. అయితే  బ్రహ్మాజీ సిందూరం రీమేక్ లో నటిస్తూ బిజీగా ఉండడంతో ఈ సినిమాకు సునీల్ ని ఒకే చేశారట.:

ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించారు. అందాల రాముడు మూవీలో సునీల్ మంచి ఎమోషన్స్ పండించాడు. దీంతో ఈ సినిమాకు అడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అప్పట్లోనే 18 కోట్లు వసూలు చేసి, ఆశ్చర్య పరిచింది. అయితే రానురాను హీరోగా క్లిక్ కాకపోవడంతో సునీల్ మళ్ళీ కమెడియన్ గా కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: