పవన్ కళ్యాణ్ ఆశించినంతగా రాజకీయాల్లో దూసుకుపోలేకున్నాడని కొంత మంది అభిప్రాయం. అయితే రాజకీయాలకు కొంచెం గ్యాప్ ఇచ్చి, తాజాగా ఒక సినిమాతో మన ముందుకొచ్చాడు పవర్ స్టార్. ఎన్నో ఆశలను పెట్టుకున్న అభిమానులకు మంచి విందు భోజనం పెట్టాడని చెప్పొచ్చు. వకీల్ సాబ్ అనే సినిమాతో ఏప్రిల్ 9 న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా విడుదల అయిన అన్ని చోట్ల మంచి కలెక్షన్ లతో దూసుకెళుతోంది. తాజాగా వకీల్ సాబ్ కలెక్షన్ వివరాలను నిర్మాత దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక్కడలాగే వకీల్ సాబ్ సినిమా అమెరికాలో విడుదల అయింది.

అయితే అమెరికాలో మన స్టార్ హీరోల సినిమాలు విడుదలయి 3.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించడం అన్నది ఒక సంచలనం. ఇంతకు ముందు బాహుబలి కూడా మంచి కలెక్షన్ లు సాధించి తెలుగు సినిమా చరిత్రలో రికార్డు సాధించింది. మన నిర్మాతలు సైతం అమెరికాను మరో నిజాంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే వకీల్ సాబ్ విషయంలోనూ ఇదే విధంగా జరుగుతుందని ఎంతో ఆశగా ఉన్నారు. గతేడాది నుండి ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మరోసారి సెకండ్ వేవ్ పేరుతో రంగ ప్రవేశం చేయడంతో వకీల్ సాబ్ ఆశలన్నీ గల్లంతయ్యాయి.

దీని కారణంగా ఇక్కడ తెలుగు సినిమా మార్కెట్ ప్రమాదంలో పడింది. దీని కారణంగా వకీల్ సాబ్ నష్టాల బాటలో నడుస్తోందని తెలుస్తోంది. రెండు రోజుల ముందు వరకు ఈ సినిమా 730K డాలర్లు వసూలు చేయగలిగింది. కానీ సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే కనీసం 1.4 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయాల్సి ఉంది.  గగతంలో పవన్ సినిమా అజ్ఞాతవాసి 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. కానీ వకీల్ సాబ్ అంతకన్నా దారుణమైన వసూళ్లతో తీర్వంగా నిరాశపరిచింది. కరోనా కారణంగా ఇక్కడ కూడా వసూళ్లు తగ్గే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: