దేశముదురు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన బ్యూటీ హన్సిక. అది చిన్న వయసులోనే హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి. ఆ తర్వాత ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో తన కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే, కోలివుడ్ కి వెళ్లి స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయింది. అక్కడ పెద్ద హీరోలు అయినా విజయ్,సూర్య, విశాల్  లాంటి వాళ్ళతో కలిసి నటించింది హన్సిక. తెలుగులో ఆమెకు అవకాశాలు లేనప్పటికీ తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.


అయితే కొత్త హీరోయిన్లు రావడంతో హన్సికకు ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గాయి. స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలో ఛాన్స్ లు రానప్పటికీ,  ప్రయోగాత్మక చిత్రాల వైపు అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో కొన్ని లేడీ ఓరియెంటెడ్ కథలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ మరో డిఫరెంట్ సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు రాని ఓ సరికొత్త సినిమా ఇది. ఒకే క్యారెక్టర్ తో, సింగిల్ షాట్ తో తీయబోయే సినిమాలో హన్సిక నటించబోతోంది.


సినిమా పేరు '105 మినిట్స్ ' రాజు దుస్సా అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం ను రుద్రాన్ష్ సెల్యులాయిడ్ బ్యానర్ మీద  బొమ్మక్ శివ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హన్సిక తప్ప మరెవరూ కనిపించరట. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎడిటింగ్ లేకుండా కంటిన్యుటీ తో ఓకే షాట్ లో కథ మొత్తం చెప్పేస్తారట. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు ఇండియాలో ఇప్పటివరకు రాలేదని కూడా  చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి సినిమాతోనైనా హన్సిక తన హవా కొనసాగుతుందో ఏమో చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి సినిమా రాలేదు. కాబట్టి మంచి హిట్టు సాధించాలని మనం కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: