బాలకృష్ణ లెజెండ్ సినిమాతో జగపతి బాబు కెరీర్ ని పూర్తిగా మార్చి వేశాడు బోయపాటి శ్రీను.. ఆ సినిమా తర్వాత జగపతిబాబు ఏ రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడో మనం అందరం చూస్తూనే ఉన్నాము.. ఇక అదే స్థాయిలో రాణించాలని హీరో శ్రీకాంత్ గత కొన్ని రోజులుగా వెరైటీ పాత్రలు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.. ఈ నేపథ్యంలో విలన్గా చేయడానికి కూడా శ్రీకాంత్ ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.. ఇప్పటికే నాగచైతన్య యుద్ధం శరణం అనే సినిమాలో శ్రీకాంత్ విలన్ గా చేశాడు.. కెరీర్ తొలినాళ్లలో విలన్ గా తీసిన శ్రీకాంత్ ఆ తరువాత హీరోగా మారి పలు హిట్ సినిమాల్లో నటించాడు ..
అయితే మారుతున్న ట్రెండ్ ప్రకారం శ్రీకాంత్ సినిమాలు చేయకపోవడంతో ఆయనను ప్రేక్షకులు చూడడం మానేశారు.. దాంతో ప్రత్యేక మైన పాత్రలు వేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఎప్పుడూ తన వైపే ఉంచుకునేలా చేసుకుంటున్నాడు.. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు శ్రీకాంత్.. విలన్ లను కూర గా చూపించే బోయపాటి శ్రీను శ్రీకాంత్ అని ఏ రేంజ్లో చూపెడతాడో అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా అఖండ గా బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు.. మరి శ్రీకాంత్ కి, ఆయన కెరియర్ కి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే