నాగబాబు కూతురు, నటి కొణిదెల నిహారిక వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.. డెస్టినేషన్ మ్యారేజ్ గా జరిగిన ప్రేమ వివాహానికి మెగాఫ్యామిలీ లోని ప్రతి ఒక్కరూ తరలి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.. నిహారిక తమ దగ్గర బంధువు అయినా జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకుంది.. ఇక కూతురు పైన ప్రేమను నాగబాబు చాలాసార్లు చాలా విధాలుగా బయటపెట్టాడు.. ఆమె కావాలి అన్నా ప్రతిదీ తీసుకొచ్చి ఆమె ముందు ఉంచాడు.. నటిగా ఎదగాలన్న కోరిక ను ఏ నాడు ఆపలేదు నాగబాబు.. యాంకర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి నిహారిక ఆ తరువాత పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది..

 ఒక మనసు చిత్రంలో ఆమె చేసిన నటనకు గానూ అందరి నుంచి మంచి ప్రశంసలు దక్కించుకుంది..  ఆమె సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించి తాను అన్ని రకాల ప్లాట్ ఫామ్ లలో చేయడానికి సిద్ధమని తెలిపింది.. పెళ్లి తర్వాత కూడా ఆమె పలు వెబ్ సిరీస్ లో నటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. ఈ మధ్యనే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా ఆమె కాలికి గాయం అయినట్లు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.. అప్పుడు తన భర్త తనకు చేసిన సపర్యల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంది కూడా.. ఇక కూతురు ఇంత ఆనందంగా ఉండడం తో నాగబాబు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.. అందుకేనేమో అల్లుడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు మెగా బ్రదర్..

అల్లుడు చైతన్యకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు నాగబాబు..  రేంజ్ రోవర్ డిస్కవర్ ను అల్లుడికి ఇస్తూ నిహారిక చైతన్య లను సర్ప్రైజ్ చేశాడు..  అయితే ఈ విషయాన్ని నాగబాబు శనివారం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.. నా అల్లుడుకి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ ఇన్ స్టా లో పేర్కొన్నాడు.. ఈమేరకు కూతురు నిహారిక చైతన్యకు కారును డెలివరీ చేస్తున్న ఫోటోలు షేర్ చేశాడు.. దీని ఖరీదు దాదాపు 70 లక్షలు ఉంటుందని అంచనా.. అయితే వాస్తవానికి ఇది ఉగాదికి ఇవ్వాల్సిన కానుకగానే కానీ కాస్త ఆలస్యం అయిందని నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో  వీడియోలో చెప్పాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: