పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అంతులేని, ఎనలేని ప్రేమను చూపిస్తుంటారు ఆయన అభిమానులు.. ఆయన సినిమా వస్తుందంటే చాలు కోట్లాది మంది అభిమానులు ఒకేసారి కదలి ఆయన సినిమాను పెద్ద హిట్ ని జేస్తారు.. దానికి ఉదాహరణ చెప్పాలంటే ఇటీవలే విడుదలైన వకీల్ సాబ్ సినిమా యొక్క కలెక్షన్లే నిదర్శనం. ఏప్రిల్ 9 న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లను సాధిస్తుంది అంటే దాని గొప్పతనం ఆయన అభిమానులే అని చెప్పాలి.. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దాన్ని బంపర్ హిట్ గా మార్చేస్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. సౌత్ లో రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో ఉన్న హీరో ఒక్క పవన్ కళ్యాణ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు..

 ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు.. తమ అభిమాన నటుడికి ఏం కాకూడదని కోట్లాది మంది అభిమానులు దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు.. ఇక సెలబ్రిటీలు సైతం పవన్ కళ్యాణ్ కు అభిమానులు గా ఉంటారు.. వారిలో నితిన్ వంటి హీరోలు కూడా ఉండడం విశేషం.. ఇక పవన్ కళ్యాణ్ వీర అభిమాని గా ఉన్నారు బిగ్బాస్ ఫేమ్ ఆశు రెడ్డి.. గతంలో చాలాసార్లు ఈమె పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంది.. ఇటీవలే పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ జన్మ ధన్యమైందని కూడా ఆమె చెప్పుకుంది..

 తాజాగా పవన్ కళ్యాణ్ కి కరుణ పాజిటివ్ అని తెలియడంతో ఆమె కన్నీరుమున్నీరు అయ్యింది.. తన ఆరాధ్యదైవమైన పవన్ కళ్యాణ్ కు ఏమి కావద్దని ఏడుస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.. వీలుని బట్టి ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది.. కానీ ఇది ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు.. పనేదో ఫ్యామిలీ నెంబర్ అయినట్లుగా అంతగా ఏడవడం నాచురల్ గా లేదు అని ఫ్యాన్స్ అంటున్నారు.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అర్జున్ రెడ్డి పవన్ కళ్యాణ్ భజన చేస్తుంది, అంతకు ముందు తన అభిమానం ఏమైందని ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.. ఇదంతా కేవలం నటన, ఇమేజ్ కోసం గుర్తింపు కోసం ఆమె పడే తపన మాత్రమే.. నిజమైన అభిమానం కాదని అభిమానులు తేల్చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: