చిన్ననాటి స్నేహం ఎంతో మధుర జ్ఞాపకాలను ఇస్తూ ఉంటుంది. పెద్దాయ్యాక ఎవరు ఎలాంటి రంగంలో రాణిస్తారో.. ఎలా స్థిరపడుతారో ఎవరికీ తెలిదు. కానీ చిన్ననాటి మిత్రులు కలిసినపుడు వచ్చే ఆనందం వేరు. ఇక కొన్ని పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. పాఠశాలల్లో విద్యార్థులు భేటీ అవుతూ ఆనాటి మధురానుభూతులను పంచుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం చిన్ననాటి మిత్రులను కలుస్తున్నారు. అయితే చిన్నప్పుడు ఒకే పాఠశాలలో ఒకే బెంచీలో కూర్చున్న మిత్రులు ఇప్పుడు స్టార్ హీరోలుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. వారు ఎవ్వరో ఒక్కసారి చూద్దమా.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాహుబలిలో భల్లాల దేవుడిగా పాపులర్ అయిన రానా ఇద్దరూ చిన్నప్పటి మిత్రులే. వీరిద్దరూ చిన్నతనంలో ఒకే పాఠశాలలో చదువుకున్నారు. నాచురల్ స్టార్ నాని, బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న మాచిరాజు ప్రదీప్ ఇద్దరూ కూడా చిన్నప్పటి స్నేహితులే. ఇక హైదరాబాదులోని ఓ పాఠశాలలో ఇద్దరూ కల్సి చదువుకున్నారు.

అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు కూడా చిన్నప్పుడు ఒకే తరగతి గదిలో చదువుకున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ భార్యలైన హీరోయిన్ అనుష్క శర్మ, సాక్షి ధోనిలు కూడా చిన్నప్పుడు ఒకటే స్కూల్లో కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం వ్యాపార రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఆనంద్ మహేంద్ర, ముఖేష్ అంబానీ కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు.

అంతేకాదు.. మహేష్ బాబు, తలపతి విజయ్.. మహేష్.. తన స్కూల్, కాలేజీ చదువును చెన్నైలో పూర్తిచేశాడు. ఆ సమయంలో సూర్య, కార్తీ, తలపతి విజయ్ క్లాస్‏మేట్స్. కాలేజీ రోజులలో నుంచే తలపతి విజయ్, మహేష్ బాబు విజయ్ అత్యంత ప్రాణ స్నేహితులుగా మారారు. ఇలా ఇండస్ట్రిలో తమదైన శైలిలో రాణిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: