హీరో శ్రీకాంత్ టైటిల్ పాత్ర‌లో తెలంగాణ దేవుడు పేరుతో కేసీఆర్ బ‌యోపిక్ ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్ ల‌గా నూత‌న న‌టీన‌టులు సంగీత‌, జిషాన్ ఉస్మాన్ న‌టిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో త‌నికెళ్ల‌భ‌ర‌ని, బ్ర‌హ్మానందం, సునీల్, బ్ర‌హ్మాజీ మ‌రికొంద‌రు న‌టీన‌టులు ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 23న విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్ర‌సాద్ ల్యాబ్ లో ఏర్పాటుచేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...మొద‌ట ద‌ర్శ‌కుడు హరీశ్ న‌న్ను క‌లిసి కేసీఆర్ బ‌యోపిక్ తీస్తున్నాన‌ని చెప్పారు. అంతే కాకుండా ఆ సినిమాలో నువ్వు కేసీఆర్ పాత్రలో న‌టించాలి అని చెప్పడంతో షాక్ అయ్యాను. నాకు ఆయ‌న పాత్ర సూట్ అవుతుతందా. ఆయ‌న‌లా నేను న‌టించ‌గ‌ల‌నా అనుకున్నాను. కొంత టైమ్ తీసుకుని చెబుతాన‌ని చివ‌రికి ఓకే చెప్పాను. మ‌న దేశాన్ని సాధించిన మహాత్మాగాంధీ గారిని జాతిపిత అని అంటారు. తెలంగాణను సాధించిన కేసీఆర్‌గారు కూడా ఒకరకంగా తెలంగాణ దేవుడే అని చెప్పాలి. అలాంటి కేసీఆర్ పాత్ర‌లో నాకు అవ‌కాశం లభించినందుకు నిజంగా గర్వపడుతున్నాను. 

ఆ రోజు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోకుంటే ఇలాంటి మంచి సినిమాలో నటించే ఛాన్స్ నిజంగా మిస్ చేసుకునే వాడిని. ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం ఇచ్చినందుకు ద‌ర్శ‌కుడు హ‌రీష్ కు థాంక్స్ చెబుతున్నాను. ఇక ఈ సినిమా షూటింగ్ క‌రోనా కంటే ముందే ప్రారంభ‌మైంది. సినిమాలో న‌టీన‌టులంద‌రి డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో సినిమా షూటింగ్ ఆల‌స్యం అయింది.ఈ సినిమాను నిర్మాత జాకీర్ ఉస్మాన్ ఎంతో ఫ్యాష‌నేట్ గా తీశారు. అంతే కాకుండా ఎంతో అద్బుతం గా తెర‌కెక్కించారు. ఒక మంచి స‌బ్జెక్టును ఎంతో మంది న‌టీన‌టుల‌తో క‌లిసి తెర‌కెక్కించారు. సినిమాలో హీరోగా నిటించిన జిషాన్ కు ఇదే మొద‌టి సినిమా అయిన‌ప్ప‌టీ ఎంతో అనుభ‌వం ఉన్న న‌టుడిలా న‌టించాడు. ఈనెల 23న ప్ర‌తి ఒక్క‌రూ ఈ చిత్రాన్ని చూడాల‌ని కోరుకుంటున్నాను అంటూ శ్రీకాంత్ త‌న స్పీచ్ ను ముగించారు. ఇక ఈ కార్య‌క్ర‌మానికి ఆర్ నారాయ‌ణ‌మూర్తి, మ‌హ‌మూద్ అలీ, మంత్రి శ్రీనివాస్ గౌడ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: