ఇంకెక్కడి కరోనా అంతా అయిపోయింది ఇక మామూలు జీవితం గడపడమే అని భావిస్తున్న తరుణంలో సెకండ్ వేవ్ కోరలు చూస్తోంది. ఈ దెబ్బకు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న అన్ని రంగాలు మళ్ళీ దివాలా తీసే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఇప్పటికీ వేరే రంగాలలో పూర్తిస్థాయిలో కుదుట పడలేదు కానీ సినిమా రంగం మాత్రం పూర్తిస్థాయిలో కుదుటపడి నెలకు ఒకటి చొప్పున దాదాపు మూడు నెలల్లో మూడు నాలుగు హిట్ సినిమాలు వచ్చాయి. షూటింగ్ జోరుగా నడుస్తూ ఉండటం పెద్ద ఎత్తున రిలీజ్ డేట్లు కూడా సినిమా నిర్మాణ సంస్థలు ప్రకటించడంతో సినిమా రంగం మళ్లీ మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారు. 

కానీ సెకండ్ వేవ్ దెబ్బ మళ్లీ కొడుతోంది. కరోనా మళ్లీ పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పటికే దాదాపు కాస్త క్రేజ్ ఉన్న అన్ని సినిమాలు విడుదల వాయిదా వేసుకుని వెనక్కు పోతున్నాయి. నిన్న జరిపిన సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు సీట్లు తర్వాత మూడవ సీటు వదిలేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ లెక్క ప్రకారం మూడు వంతుల్లో రెండు వంతులు ఫుల్లు అయితే మరో వంతు మిగిలి పోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 100% ఆక్యుపెన్సీ ఉన్నా జనాలు రాక ఇబ్బంది పడుతున్న ధియేటర్ యాజమాన్యాలకు ఇది కాస్త ఇబ్బందికరమైన అంశమనే చెప్పాలి. 

ఇక తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ 50% ఆక్యుపెన్సీ ప్రకటించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అదే గనుక జరిగితే రాబోయే వారాల్లో క్రేజీ సినిమాలేవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండవు. దీంతో థియేటర్లకి జనాలు వెళ్ళరు.  ఎందుకంటే పెద్ద సినిమాలు రిలీజ్ అయితే కరోనా లెక్కచేయకుండా జనాలు బయటికి వస్తారు కానీ చిన్న సినిమాలు రిలీజ్ అయితే ఓటిటీలో వచ్చే సినిమానే కదా అన్నట్టు లైట్ తీసుకుంటారు. దీంతో మళ్లీ టాలీవుడ్ సంక్షోభంలోకి వెళ్లక తప్పదు అనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: